జగిత్యాల జిల్లా (Jagtial District) పెగడపల్లి మండలం నందగిరి గ్రామానికి సమీపంలోని పెగడపల్లి-కరీంనగర్ ప్రధాన రహదారిపై ఉన్న ఎస్సారెస్పీ కాలువ వంతెన (SSRSP Canal Bridge) ఇప్పుడు ప్రమాదకరంగా మారింది. దాదాపు 40 ఏళ్ల క్రితమే నిర్మించిన ఈ వంతెన ఇప్పుడు శిథిలావస్థలోకి చేరింది. రోజూ వేలాది వాహనాలు ఈ వంతెన మీదుగా ప్రయాణించడమే గాక, ఇది కీలక రూట్ కావడంతో టెన్షన్ మామూలుగా లేదు.వంతెనపై మిషన్ భగీరథ నీటి సరఫరాతో పాటు వర్షపు నీళ్లు నిలుస్తున్నాయి. ఇసుకతో కూడిన ఈ మిశ్రమం వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇక రోడ్డు పై తేలిపోయిన రాళ్లు, కంకరల కారణంగా వాహనాలు జారిపోవడానికే కాదు, కాలువలో పడే ప్రమాదం కూడ ఉంది.
రెయిలింగ్ కూలిన వాస్తవం కలవరపెడుతుంది
వంతెనకు ఒక వైపు ఉన్న సిమెంట్ రెయిలింగ్ సగం కూలిపోయింది. ఇది పూర్తిగా ప్రమాదానికి ఆహ్వానం పలికే పరిస్థితి. వర్షం పడితే రహదారి ఎక్కడుంది? కాలువ ఎక్కడ మొదలవుతుంది? అన్న సందేహమే లేకుండా మారిపోయే స్థితిలో ఉంది.పెగడపల్లి నుంచి గంగాధర్ మీదుగా కరీంనగర్ వెళ్లే ప్రధాన రహదారి ఇది. డబుల్ రోడ్డు అయినప్పటికీ ప్రమాద భీతిని తొలగించలేకపోతుంది. నిత్యం ఈ వంతెనపై ట్రాఫిక్ గట్టి ఉంటుంది. కానీ వాహనదారులు ప్రయాణిస్తున్న ప్రతి క్షణం భయంతోనే సాగుతుంది.
అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువ
ప్రజలు, వాహనదారులు పదే పదే అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా, మరమ్మత్తులు చేపట్టలేదు. వంతెన దుస్థితిని దృష్టిలో పెట్టుకుని వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారులు అప్రమత్తం కాకపోతే భారీ ప్రమాదాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Read Also : Hyderabad : ఎల్బీనగర్‌లొని ప్రాణం తీసిన మృత్యు తీగలు