బాలికల విద్య కోసం అజీమ్ ప్రీమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్స్
హైదరాబాద్: బాలికల విద్యను ప్రోత్సహించేందుకు అజీమ్ ప్రీమ్‌జీ ఫౌండేషన్(Azim Premji Foundation)అందిస్తున్న స్కాలర్‌షిప్‌లకు ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంది. ఈ స్కాలర్‌షిప్ కింద ఎంపికైన బాలికలకు డిగ్రీ పూర్తయ్యే వరకు ప్రతి ఏడాది రూ.30,000(Scholarship 30K) ఆర్థిక సహాయం అందజేయనున్నారు.
అర్హత కలిగిన విద్యార్థినులు ప్రభుత్వ పాఠశాలలు లేదా కాలేజీల్లో 10వ లేదా 12వ తరగతి పాస్ అయి ఉండాలి. అలాగే 2025–26 విద్యా సంవత్సరంలో డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్ లేదా ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్‌లో ప్రవేశం పొందినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొదటి దశ దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత, రెండో రౌండ్ అప్లికేషన్లను జనవరి 10 నుండి 30, 2026 వరకు స్వీకరించనున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థినులు గడువు తీరకముందే దరఖాస్తు చేసుకోవాలని ఫౌండేషన్ సూచిస్తోంది.
వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది.
Read also: