భారత మాజీ దిగ్గజం యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరోసారి తన నిర్మొహమాటమైన మాటలతో వార్తల్లో నిలిచారు.యోగరాజ్ సింగ్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో టీమిండియా గురించి అనేక కీలక విషయాలను వెల్లడించారు.2011లో భారత జట్టు ప్రపంచ కప్ గెలిచిన తర్వాత, నాటి బీసీసీఐ (BCCI) సెలెక్టర్లు పలువురు సీనియర్ ఆటగాళ్ల కెరీర్లను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీశారని ఆయన మండిపడ్డారు.2011-12 సంవత్సరాల్లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా పర్యటనలలో భారత జట్టు ఘోరంగా విఫలమైన అనంతరం, ఏకంగా ఏడుగురు కీలక ఆటగాళ్లను పాతాళంలోకి తొక్కేశారని యోగరాజ్ సింగ్ (Yograj Singh) ఆవేదన వ్యక్తం చేశారు.ఎలాంటి కారణం లేకుండా మీరు ఆ కుర్రాళ్లను నాశనం చేశారు అంటూ యోగరాజ్ సింగ్ ఆనాటి సెలెక్టర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిగిలిన ఆటగాళ్లను
ప్రపంచ కప్ గెలిచిన జట్టులో కీలక సభ్యులైన గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్, మహమ్మద్ కైఫ్, వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ వంటి వారిని క్రమంగా పక్కన పెట్టారని ఆయన ఆరోపించారు. రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్ ఆ తర్వాత టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించగా, మిగిలిన ఆటగాళ్లను అన్ని ఫార్మాట్ల నుంచి దశలవారీగా తప్పించారని, 2015 ప్రపంచ కప్ ప్రణాళికల్లో వారికి చోటు దక్కకుండా చేశారని యోగరాజ్ సింగ్ గుర్తు చేశారు.ఆ సమయంలో ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ (MS Dhoni’s captaincy)చుట్టూ నెలకొన్న గందరగోళాన్ని కూడా యోగరాజ్ సింగ్ ప్రస్తావించారు.

తొలగించాలని నిర్ణయించిందని
ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు 0-4 తేడాతో వైట్‌వాష్ అయిన తర్వాత, మాజీ క్రికెటర్ మొహిందర్ అమర్నాథ్ (Mohinder Amarnath) నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ ధోనీని కెప్టెన్సీ నుంచి తొలగించాలని నిర్ణయించిందని ఆయన తెలిపారు. అయితే, అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్. శ్రీనివాసన్ జోక్యం చేసుకుని ఆ నిర్ణయాన్ని అడ్డుకున్నారని యోగరాజ్ సింగ్ ఆరోపించారు.గతంలో, 2012లో సీఎన్ఎన్-ఐబీఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మొహిందర్ అమర్నాథ్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. సెలెక్టర్లను స్వతంత్రంగా పనిచేయనివ్వడం లేదని, భారత క్రికెట్ ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ తమకు ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు యోగరాజ్ గుర్తు చేశారు. అంతర్గత ఒత్తిళ్లు ఉన్నప్పటికీ, ధోనీ 2014 చివరి వరకు టెస్టుల్లో కెప్టెన్‌గా కొనసాగాడు. ఆ తర్వాత 2017 జనవరి వరకు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జట్టును నడిపించాడు. అనంతరం విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.
Read Also: Nitish Rana: తండ్రైన క్రికెటర్ నితీష్ రాణా