हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

ఢిల్లీ ప్రచారంలో యోగీ ఎంట్రీతో కీలక మలుపు

Vanipushpa
ఢిల్లీ ప్రచారంలో యోగీ ఎంట్రీతో కీలక మలుపు

ఢిల్లీ ఎన్నికల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మూడు ప్రధాన పార్టీలకు ఇక్కడ గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ముందుగానే ఎన్నికల బరిలో దిగిన కేజ్రీవాల్ విజయం తమ దే అని ధీమాగా ఉన్నారు. బీజేపీ హర్యానా, మహారాష్ట్ర తరహాలోనే ఢిల్లీలోనూ విజయం సాధిస్తామ ని విశ్వాసంతో ఉంది. కాంగ్రెస్ మేము సైతం అంటోంది. అయితే, ఢిల్లీ ఎన్నికల ప్రచారం యూపీ సీఎం యోగీతో కొత్త మలుపు తీసుకుంది. కేజ్రీవాల్ లక్ష్యంగా యోగీ తన మార్క్ రాజకీయం మొదలు పెట్టారు.
కేజ్రీవాల్ లక్ష్యంగా ఢిల్లీ ఎన్నిక ప్రచారం పతాక స్థాయికి చేరింది. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు ఢిల్లీ ప్రచారంలోకి దిగారు. యూపీ సీఎం యోగీ ఢిల్లీలో యూపీ, బీహార్ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించారు. ఆప్, కేజ్రీవాల్ లక్ష్యంగా యోగీ తన అస్త్రాలను సంధించారు. కేజ్రీవాల్ కు సవాళ్లు చేసారు. ఆప్ పాలనలో ఢిల్లీ డంపింగ్ యార్డుగా మారిందని ఆరోపించారు. విద్యుత్ నిరంతర సరఫరాలోనూ ప్రభుత్వం విఫలమైందని టార్గెట్ చేసారు. యమునా నది మొత్తం కలుషితంగా మారిందని చెప్పిన యోగీ.. తాను చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోతే కేజ్రీవాల్ యమున నదిలో స్నానం చేయాలని సవాల్ విసిరారు.

యోగీ టార్గెట్ యోగీ ఆరోపణలపైన కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. యూపీలో విద్యుత్ కోతల గురించి ప్రశ్నించారు. ఢిల్లీలో విద్యుత్ సరఫరా గురించి ప్రశ్నిస్తున్న యోగీ.. పదేళ్లుగా యూపీలో అధికారం లో ఉండి..ఎన్ని గంటలు విద్యుత్ ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేసారు. దీనికి యోగీ స్పందిం చారు. ఈ నెలాఖరులో ప్రధాని మోదీ ఢిల్లీ ప్రచారంలో పాల్గొంటారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీకి ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. హ్యాట్రిక్ పై ఆప్ గురి పెట్టింది. కాగా, గెలుపు తమదే అంటూ బీజేపీ కొత్త వ్యూహాలతో ఎన్నికల బరిలో ముందుకు వెళ్తోంది. ఫిబ్రవరి 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870