జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్ బైసరన్ లోయలో పర్యాటకులపై ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.పాకిస్తాన్‌కి తగిన బుద్ది చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే కీలకమైన సింధూ నదీ జలాల ఒప్పందం అమలు నిలిపివేసిన భారత్ తాజాగా పాకిస్థాన్ విమానాలు భారత గగనతలంపై ప్రయాణించకుండా నిషేధం విధించింది. ఈ దెబ్బతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన పాకిస్థాన్ ఎయిర్‌లైన్లకు ఈ నిర్ణయం కొంత రుచించడం లేదు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే బోర్డర్‌లో ఏ సమయం అయిన యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తుందని కొందరు అంటున్నారు. ఇంత వివాదం జరుగుతున్న సమయంలో మహేష్ బాబు కొడుకు గౌతమ్ పాకిస్తాన్ అమ్మాయితో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుండడం హాట్ టాపిక్ అయింది.

ఇంటర్నేషనల్
ప్రస్తుతం విదేశాలలో చదువుకుంటున్న గౌతమ్అ ప్పుడప్పుడు వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తున్నాడు. ఆ మధ్య తన స్నేహితులతో కలిసి గౌతమ్ చేసిన వీడియో బాగా వైరల్ అయింది. అది చూసి గౌతమ్‌లో కూడా మంచి టాలెంట్ ఉందని, తండ్రిని మించిన తనయుడు అవుతాడని కొందరు జోస్యాలు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా గౌతమ్ ఇండియన్ జెర్సీ ధరించి పాక్ జెర్సీ ధరించిన అమ్మాయితో షికార్లు వేస్తున్నాడు. ఇది ఒక షార్ట్ ఫిలిం అయిన అందులోని దృశ్యాలు, టీ షర్ట్‌పై ఉన్న పేర్లు వివాదం రాజేసేలా ఉన్నాయి. ఇది విద్యాభ్యాసంలో భాగంగా తీసిన వీడియో అని అంటున్నా, అందులోని సన్నివేశాలు వేడి పుట్టిస్తున్నాయి.మహేష్ బాబు తన నటనతో ఇంటర్నేషనల్ స్థాయికి ఎదుగుతున్న సమయంలో ఆయన తనయుడు ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం ఇప్పుడు అభిమానులకి మింగుడుపడడం లేదు. గౌతమ్ ఇప్పుడు న్యూయార్క్ యూనివర్సిటీలోని టిష్ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్‌లో చదువుతున్నాడు. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఎప్పటిదో అని, టీ షర్ట్‌పై ఉన్న పేర్లు కేవలం పాత్రల కోసమే ఉపయోగించారని, దీని వెనక మరే ఉద్దేశం ఉండి ఉండదు అని కొందరు అంటున్నారు. మరి ఈ వీడియోపై మహేష్ బాబు ఫ్యామిలీ ఏమైన స్పందిస్తుందా అనేది చూడాలి.
Read Also: Summit: వేవ్స్ సమ్మిట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన చైతూ, శోభిత