బిహార్‌లో తొలిసారి బీజేపీ సర్కార్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. సుదీర్ఘకాలం సీఎంగా కొనసాగిన నీతీశ్‌కుమార్ రాజ్యసభకు వెళ్లనుండటంతో కమలం పార్టీకి మార్గం సుగమమైంది. అయితే బీజేపీ నుంచి ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరు చేపడ్తారనే విషయమై తీవ్రచర్చ మొదలైంది. సీఎం రేసులో బిహార్(Bihar) ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరీ, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, దిల్లీ, ఒడిశాలో మాదిరిగా అనూహ్యంగా కొత్తవారికి అవకాశం దక్కే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
బిహార్‌లో తమ ప్రభుత్వం ఏర్పడాలన్న బీజేపీ కల ఎట్టకేలకు సాకారం కానుంది. 4నెలల క్రితం జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 89స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించటంతో సీఎంగా నీతీశ్‌కుమార్‌ను మార్చటం తథ్యమనే విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండోసారి జేడీయూ కంటే బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుపొందింది.
Read Also: Social Media Ban: పిల్లలకు సోషల్ మీడియా నిషేధం: అమలులో సాంకేతిక సవాళ్లు!

బడుగు, బలహీన వర్గాలకే సీఎం పీఠం
1990ల్లో బిహార్ రాజకీయాల్లో అగ్రవర్ణాల ఆధిపత్యానికి ముగింపు పలికిన మండల్ ఉద్యమంతోనే లాలూప్రసాద్ యాదవ్, నీతీష్ కుమార్ కీలక నేతలుగా ఎదిగారు. ఇప్పుడు బీజేపీ కూడా సామాజిక వ్యూహంతోనే బడుగు, బలహీన వర్గాలకే సీఎం పీఠం కట్టబెట్టవచ్చనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. బిహార్ ఉపముఖ్యమంత్రి, హోంశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సామ్రాట్ చౌదరి కోయెరీ- ఓబీసీ సామాజికవర్గానికి చెందినవారు. ఈ వర్గానికి ఇప్పటివరకు సీఎం అయ్యే అవకాశం రాలేదు. ఆయనను పెద్ద నాయకుడిని చేస్తామని ఎన్నికల ప్రచారంలో అమిత్ షా ప్రకటించారు. అయితే సామ్రాట్ చౌదరీ ఆర్జేడీ నుంచి వచ్చి పదేళ్లు కూడా కాకపోవడంతో బీజేపీ అధినాయకత్వం ఆయనపై ఎంతవరకు విశ్వాసం చూపుతుందన్నది ఆసక్తి రేపుతోంది.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :