हिन्दी | Epaper

West Bengal Crime: విద్యార్థులపై ఉపాధ్యాయుడు కాల్పులు

Anusha
West Bengal Crime: విద్యార్థులపై ఉపాధ్యాయుడు కాల్పులు

West Bengal Crime: పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు విచక్షణారహితంగా వ్యవహరించాడు. తన ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి విద్యార్థులపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ దారుణ ఘటనలో ఒక విద్యార్థికి గాయాలవ్వగా, బాధితుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

Read Also: AI ImpactSummit: ప్రపంచ AI హబ్‌గా భారత్.. ఢిల్లీ డిక్లరేషన్‌కు 80 దేశాల మద్దతు

బంతి తగిలిందని ఆగ్రహం..

వివరాల్లోకి వెళ్తే.. బనిపూర్ గ్రామానికి చెందిన సమీర్ అనే ఉపాధ్యాయుడి ఇంటి పక్కన ఒక ఖాళీ స్థలం ఉంది. శుక్రవారం మధ్యాహ్నం ఆ ప్రాంతానికి చెందిన సుమారు 10 నుండి 12 మంది విద్యార్థులు అక్కడ క్రికెట్, ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు. ఆటలో భాగంగా బంతి పలుమార్లు సమీర్ ఇంటి తలుపులకు, గోడలకు తగిలింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సమీర్, పిల్లలను మందలించాల్సింది పోయి లోపలి నుండి తుపాకీ తెచ్చి మైదానంలో ఉన్న పిల్లలపై ఏకంగా ఆరు రౌండ్ల కాల్పులు జరిపాడు.

West Bengal Crime: Teacher shoots at students
West Bengal Crime: Teacher shoots at students

తన ఇంటి పై అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి కాల్పులు జరిపాడని  ఓ విద్యార్థి మీడియా ప్రతినిధులతో చెప్పాడు. ఒక బుల్లెట్ తన స్నేహితులలో ఒకరికి తగిలిందని చెప్పాడు. స్థానికులు విద్యార్థిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించాడు.విషయం తెలియగానే రఘునాథ్ గంజ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని శుక్రవారం రాత్రి అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు ఒమర్‌పూర్ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థి ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

హార్దిక్‌కు రోహిత్ సలహాలు అవసరం: హర్భజన్ సింగ్

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

బీడబ్ల్యూఎఫ్ కొత్త రూల్స్‌పై సైనా నెహ్వాల్ అసహనం

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ కిట్ల కోసం రూ. 200 కోట్లు కేటాయింపు

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్

ఉస్తాద్ భగత్ సింగ్ ఈవెంట్ తేదీ ఫిక్స్

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం

అంతర్జాతీయ క్రికెట్‌లో ఐదేళ్లు.. సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగం

పాకిస్థాన్ లీగ్‌ను కాదన్న ముజరబానీపై పీసీబీ ఫైర్?

పాకిస్థాన్ లీగ్‌ను కాదన్న ముజరబానీపై పీసీబీ ఫైర్?

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

యూఏఈ వాసులకు ఇరాన్ వార్నింగ్

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

📢 For Advertisement Booking: 98481 12870