हिन्दी | Epaper

WAVES: వేవ్స్ ఈవెంట్ ను ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ

Sharanya
WAVES: వేవ్స్ ఈవెంట్ ను ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ

ముంబయిలోని ప్రతిష్టాత్మక జియో వరల్డ్ సెంటర్ వేదికగా ప్రపంచ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్ ఈ రోజు ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాంఛనంగా ప్రారంభించారు. భారతీయ సినీ, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాలకు గ్లోబల్ ప్రాముఖ్యత తీసుకురావడమే ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశ్యంగా ఉంది.

ప్రధానమంత్రి ఈ సందర్భంగా చలన చిత్ర రంగంపై మాట్లాడుతూ, “భారతీయ సినీ పరిశ్రమ దేశ సాంస్కృతిక శక్తికి ప్రతిరూపం. భారత కథలు, కళలు, సాంకేతిక నైపుణ్యం ప్రపంచమంతా గుర్తింపు పొందుతున్నాయి” అని అన్నారు. న‌టీన‌టులు, దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులు అందిస్తున్న సేవలను ప్రశంసిస్తూ, వారు దేశ గౌరవాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రతినిధిస్తున్నారు అన్నారు.

వేవ్స్ 2025 ముఖ్యాంశాలు:

ఈ సమ్మిట్‌ను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మరియు మహారాష్ట్ర ప్రభుత్వము సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. నాలుగు రోజుల పాటు జరగనున్న ఈ మహాసమ్మేళనం, ప్రపంచవ్యాప్తంగా సినీ, టెలివిజన్, OTT, మ్యూజిక్, గేమింగ్ రంగాల నుంచి ప్రముఖులను ఒకే వేదికపైకి తెచ్చింది. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ప్రొడక్షన్ హౌస్‌లు, OTT జెయింట్‌లు, ఫిల్మ్ ఫెస్టివల్ కమీషనర్లు, సినీ తారలు తదితరులు పాల్గొంటున్నారు. వినూత్న సాంకేతికత, వర్చువల్ ప్రొడక్షన్, AI ఆధారిత కథా రచన, భవిష్యత్తు సినీమా దిశగా భారత ప్రస్థానం వంటి అంశాలపై ప్యానెల్ చర్చలు జరుగుతున్నాయి. భారతీయ కంటెంట్‌ను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేందుకు ప్రత్యేక సమావేశాలు, బిజినెస్ టు బిజినెస్ (B2B) సమావేశాలు జరుగుతున్నాయి.

read also: WAVES: ‘వేవ్స్‌’ సమ్మిట్‌ ఈవెంట్‌కు హాజ‌రైన చిరంజీవి.. వీడియో వైరల్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

వాణిజ్య గ్యాస్ కొరతకు తమిళనాడు చెక్.. ఎలక్ట్రిక్ స్టౌవ్‌లపై ప్రత్యేక ప్రోత్సాహకాలు.

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

విమాన ప్రయాణికులకు షాక్: భారీగా పెరిగిన టికెట్ ధరలు!

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

మద్యం పాలసీ కేసు.. కోర్టులో షూరిటీ బాండ్లు సమర్పించిన కేజ్రీవాల్, సిసోడియా

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సిల్చార్‌లో రూ. 23,550 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!
0:32

నితీష్ కుమార్ పర్యటనలో భద్రతా లోపం.. హెలిప్యాడ్‌లోకి దూసుకెళ్లిన ఆవు!

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఐసీయూ లో ఓ తల్లి చికిత్స.. రూ. 50 లక్షల బిల్లుతో కొడుకు ఆవేదన

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేదు.. రూ. 2,500 లోపే బెస్ట్ ప్లాన్స్!

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

భారత చమురు కంపెనీలకు రోజుకు రూ. 2 వేల కోట్లు నష్టం

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

📢 For Advertisement Booking: 98481 12870