हिन्दी | Epaper
రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Bengaluru Water: బెంగళూరు ప్రజలకు త్వరలో నీటి ఛార్జీల పెంపు!

Vanipushpa
Bengaluru Water: బెంగళూరు ప్రజలకు త్వరలో నీటి ఛార్జీల పెంపు!

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు ఎక్కువగా కర్ణాటకలోని బెంగళూరు నగరానికి ఉద్యోగ, వ్యాపారాల రీత్యా వలస వెళుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కిక్కిరిసిన నగరంలో ట్రాఫిక్ కష్టాలు సర్వసాధారణంగా మారిపోగా.. మరో పక్క ప్రజలకు నీటి ఎద్దడి సమస్యలు సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. వేసవి ప్రారంభం కావటంతో నగరంలోని ప్రజలు ఇప్పటికే నీటి లభ్యత తగ్గటంతో ఆందోళన చెందుతున్నారు.
తాగునీటి పన్నును లీటరుకు ఒక పైసా పెంచే ప్రణాళిక
తాజాగా కర్ణాటక డిప్యుటీ సీఎం డికె. శివకుమార్ బెంగళూరులో తాగునీటి పన్నును లీటరుకు ఒక పైసా పెంచే ప్రణాళికలను ప్రకటించారు. ఇది దాదాపు 11 సంవత్సరాల విరామం తర్వాత ప్రణాళిక ప్రకారం తాగునీటి పన్నును పెంపుగా ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం బెంగళూరు నగరంలోని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలతో జరిగిన సంప్రదింపుల అనంతరం అధికారికంగా ప్రకటించబడింది. దాదాపు దశాబ్ధానికి పైగా భూగర్భజలాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్న బెంగళూరు, దాని చుట్టుపక్కలి ప్రాంతాల్లో ఇది పెరుగుతున్న నీటి సమస్యలను ప్రతిబింబిస్తోంది.

 బెంగళూరు ప్రజలకు త్వరలో నీటి ఛార్జీల అప్!


నష్టాలు తగ్గించుకోవడమే ప్రధాన ఉద్దేశం
బెంగళూరు నీటి సరఫరా బోర్డు తాగునీటి పన్నును లీటరుకు 7-8 పైసలు పెంచాలని సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. దీనివల్ల నష్టాలు తగ్గించుకోవడమే ప్రధాన ఉద్దేశం కావచ్చని, అయితే శివకుమార్ ప్రస్తుతం ఈ పెంపును కేవలం లీటరుకు ఒక పైసాగా ఉండేలా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 2014 నుంచి నగరంలో నీటి పన్ను పెంచడం లేదని, ప్రస్తుతం నీటి సరఫరా బోర్డు ఎదుర్కొంటున్న ఆర్థిక భారం కారణంగా తాజా రేటు పెంపు నిర్ణయం తీసుకోవడం అవశ్యకమైందని చెప్పారు.
ఈ పెంపు ప్రజలపై ఆర్థిక భారం
బెంగళూరు నీటి సరఫరా బోర్డు ఇప్పటికే 100 కిలోమీటర్ల దూరం నుండి తాగునీటిని తీసుకొచ్చి నగరానికి పంపిణీ చేస్తోంది. ఇది 2014తో పోలిస్తే చాలా ఎక్కువ ఖర్చుతో జరుగుతోంది. అందువల్ల బోర్డు ప్రస్తుతం ఏడాదికి దాదాపు రూ.1,000 కోట్ల నష్టంతో పనిచేస్తున్నట్లు సమాచారం. విద్యుత్ బిల్లులు, బస్సు ఛార్జీలు, పాల ధరలు అన్నీ పెరిగాయి. కానీ నీటి పన్ను పెంచడం లేదని శివకుమార్ ఈ సందర్భంగా ప్రజలకు వెల్లడించారు. కానీ ఇది పెరిగిన భారాన్ని తగ్గించే ఉద్ధేశ్యంతో తీసుకురాబడిందని ఆయన అన్నారు. అయితే ఈ పెంపు ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని, అందుకే ప్రస్తుతం ఒక్క పైసా పెంపు చాలని నిర్ణయించామన్నారు.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పెంచిన పన్ను ధరల గురించి ఈ నెలలోనే ప్రభుత్వం అధికారిక ప్రకటనను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. దీనివల్ల బెంగళూరులోని ప్రతీ ఇంటికి నెలకు అదనంగా రూ.400 నుండి రూ.500 వరకు నీటి బిల్లు చెల్లించాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఇదే సమయంలో అక్రమంగా నీటి కనెక్షన్ పొందిన బిల్డర్లను గమనించి వారికి నోటీసులు జారీ చేయటంతో పాటు.. చెల్లించాల్సిన మొత్తాన్ని వసూలు చేయడానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870