हिन्दी | Epaper

Water Bottle Price Hike: వార్ ఎఫెక్ట్.. పెరగనున్న వాటర్ బాటిల్స్ ధరలు!

Aanusha
Water Bottle Price Hike: వార్ ఎఫెక్ట్.. పెరగనున్న వాటర్ బాటిల్స్ ధరలు!

Water Bottle Price Hike: మధ్యప్రాచ్య సంక్షోభం, భారతీయ వినియోగదారుల జేబుకు చిల్లు పడనుంది.. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా దేశీయ ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్ (Packaged Drinking Water) మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. సుమారు 5 బిలియన్ డాలర్ల విలువైన ఈ మార్కెట్‌పై యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని రాయిటర్స్ నివేదిక వెల్లడించింది.

Read Also: Stock market: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

తయారీ ఖర్చులు పెరగడానికి కారణమేంటి?

ఈ యుద్ధం కారణంగా చమురు సరఫరా వ్యవస్థలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్లాస్టిక్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలు పెట్రోలియం ఉత్పత్తుల నుంచి లభిస్తాయి. చమురు ధరలు పెరగడంతో వాటర్ బాటిల్ తయారీకి వాడే ప్రతి వస్తువు ఖరీదు పెరిగింది:

రవాణా ఖర్చులు: డీజిల్ ధరల పెరుగుదల వల్ల డిస్ట్రిబ్యూషన్ ఖర్చులు అధికమవ్వడం.

ప్లాస్టిక్ బాటిళ్లు & మూతలు: ముడి ప్లాస్టిక్ ధరలు పెరగడం.

లేబుల్స్ & ప్యాకేజింగ్: లేబుల్స్, కార్డ్‌బోర్డ్ బాక్సుల తయారీ వ్యయం పెరగడం.

War effect.. Prices of water bottles will increase!
War effect.. Prices of water bottles will increase!

దీనివల్ల సుమారు 2,000 వరకు చిన్న తరహా తయారీదారులు డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చే బాటిల్ ధరను 1 రూపాయి మేర పెంచారు. రాబోయే రోజుల్లో ఇది మరో 10శాతం పెరిగే అవకాశం ఉందని ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది.చమురు కొరత నేపథ్యంలో పెట్రోలియం ధరలు పెరగడంతో ప్లాస్టిక్ తయారీకి వాడే పాలిమర్ ధర కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం కేజీకి పాలిమర్ రూ.170 కి చేరింది. అంటే గతంలో కన్నా ఇది 50శాతం పెరిగినట్టు తెలుస్తోంది.దీంతో బాటిల్ మూతల ధర కూడా పెరిగి 0.45 పైసలకు చేరుకుంది.

అయితే బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం ఒక లీటర్ బాటిల్‌ను రూ.20కు విక్రయిస్తున్నారు. కానీ తయారీ ఖర్చులు పెరగడంతో రాబోయే రోజుల్లో ఇది పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.అయితే మన దేశంలోని సుమారు 70 శాతం భూగర్భ జలాలు కలుషితమైన కారణంగా దేశంలో ఉన్న సుమారు 140 కోట్ల మంది ప్రజలు వాటర్ బాటిల్ నీటినే తాగుతున్నారు. కాబట్టి మన దేశంలో వాటర్ అనేది విలాసం కాదని.. ఒక అవసరంగా మారిందని చెబుతున్నారు. బిస్లేరి, కిన్లే, ఆక్వాఫినా వంటి దిగ్గజ సంస్థలు ఈ మార్కెట్లో పోటీ పడుతున్నాయి. ప్రస్తుతానికి పెద్ద కంపెనీలు ధరల భారాన్ని భరిస్తున్నప్పటికీ, చిన్న కంపెనీలు మాత్రం ధరలు పెంచక తప్పని పరిస్థితిలో ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870