ఆంధ్రప్రదేశ్‌లో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులలో ఒకటైన విజయవాడ (VJA) బైపాస్ పనులపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. లోక్‌సభలో ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిస్తూ, గొల్లపూడి నుంచి చినకాకాని వరకు నిర్మిస్తున్న 17.88 కిలోమీటర్ల ఆరు వరుసల విజయవాడ బైపాస్ పనులు మార్చి 31 నాటికి పూర్తవుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం కేవలం 4 కిలోమీటర్ల మేర పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని, అవి కూడా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.2019లో ఈ ఆరు వరుసల బైపాస్ నిర్మాణానికి రూ. 1,194 కోట్ల అంచనా వ్యయంతో అనుమతులు మంజూరు చేశారు.
Read Also: Gold rate record : రూ.2 లక్షలకు బంగారం! సామాన్యుడికి మరింత దూరమా?

Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: