Vijay TVK party : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ హామీల వర్షం కురిపించారు. మహిళల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పలు కీలక పథకాలను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని ఆయన వెల్లడించారు.
మహిళలకు నెలకు రూ.2,500 ఎవరికీ లభ్యం?
ప్రభుత్వ ఉద్యోగులు మినహా, 60 సంవత్సరాల లోపు మహిళలందరికీ ప్రతి నెల రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని విజయ్ చెప్పారు. అలాగే ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఆరు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించే అన్నపూరణి సూపర్ సిక్స్ పథకం అమలు చేస్తామని వెల్లడించారు.
పెళ్లికి బంగారం.. యువతులకు ప్రత్యేక పథకం
యువతుల పెళ్లికి 8 గ్రాముల బంగారం, పట్టుచీర అందిస్తామని విజయ్ ప్రకటించారు. మహిళల ఆర్థిక భద్రత కోసం ఈ పథకాన్ని తీసుకొస్తామని తెలిపారు.
విద్యార్థులకు రూ.15,000 సాయం
కామరాజర్ కల్వి ఉరుతి తిట్టం పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు సంవత్సరానికి రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
Read Also: Varun Chakravarthy: మిస్టరీ స్పిన్నర్ కు అశ్విన్ కీలక సూచనలు

మహిళల భద్రతకు కొత్త చర్యలు
మహిళలపై జరిగే నేరాలను వేగంగా విచారించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని విజయ్ తెలిపారు. ప్రజారవాణా వాహనాల్లో మహిళల భద్రత కోసం స్మార్ట్ పానిక్ బటన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
స్వయం సహాయక సంఘాలకు భారీ రుణాలు
స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందిస్తామని చెప్పారు. అలాగే నవజాత శిశువులకు బంగారు ఉంగరం, బేబీ కిట్ అందించే పథకాన్ని కూడా అమలు చేస్తామని ప్రకటించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: