ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ (Vijay) తన రాజకీయ లక్ష్యాలపై స్పష్టమైన ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి కింగ్‌మేకర్‌గా వ్యవహరించడానికి రాలేదని, రాబోయే ఎన్నికల్లో గెలవడానికే వచ్చానని ఆయన తేల్చిచెప్పారు. రాజకీయ పార్టీని స్థాపించిన తర్వాత తొలిసారిగా ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Read Also: The Kerala Story 2 – Goes Beyond: ది కేరళ స్టోరీ సీక్వెల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎంజీఆర్, జయలలిత ఆదర్శం
“నేను గెలుస్తాను. కింగ్‌మేకర్‌గా ఎందుకు ఉండాలి? నాకు వస్తున్న ప్రజాదరణ మీరు చూడటం లేదా?” అని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రయాణం కేవలం ఒక్క ఎన్నికకు పరిమితం కాదని, దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నానని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రులు ఎంజీఆర్, జయలలిత తనకు ఆదర్శమని ఆయన (Vijay) పేర్కొన్నారు. దశాబ్దాలుగా సినిమా స్టార్‌గా ఉన్న తాను, రాజకీయ నాయకుడిగా మారడం అంత సులభం కాదని అంగీకరించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: