తమిళనాడులో జరిగిన ఓ రాజకీయ సభలో అత్యంత దురదృష్టకరమైన తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటివరకు 40 మంది ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనపై వివిధ రాజకీయ, న్యాయపరమైన స్పందనలు వెల్లువెత్తుతున్నాయి.

స్వతంత్ర విచారణ కోసం విజయం పార్టీ హైకోర్టు ఆశ్రయం
ఈ ఘటనపై న్యాయపరమైన చర్యలు త్వరితంగా జరగాలని కోరుతూ, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది.డిప్యూటీ జనరల్ సెక్రటరీ సి.టి.ఆర్. నిర్మల్ కుమార్ మాట్లాడుతూ, సోమవారం మధ్యాహ్నం 2:15 గంటలకు మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనంలో ఈ విషయంలో అత్యవసర విచారణ జరగనుందని తెలిపారు.
సభలో చోటుచేసుకున్న ఘోర ఘటన
శనివారం సాయంత్రం కరూర్ (Karur)జిల్లాలోని వేలుసామిపురంలో జరిగిన ఈ సభలో, విజయ్ ప్రసంగాన్ని వినేందుకు వేలాది మంది ఉదయం నుంచే వేచి ఉండగా, అక్కడ తగిన ఆహారం, నీరు, వైద్య సదుపాయాలు లేకపోవడం, మరియు విజయ్ రాక ఆలస్యం కావడం కారణంగా జనసందోహం తీవ్రమైంది.
జనం ఒకేసారి వేదికకు చేరేందుకు ప్రయత్నించడంతో, ఇరుకైన దారుల్లో తొక్కిసలాట జరిగింది. ఈ సంఘటనలో అనేక మంది ఊపిరాడకుండా, కాళ్ల కింద పడి ప్రాణాలు కోల్పోయారు.మృతుల్లో:9 మంది చిన్నారులు,ఎక్కువమందికి మహిళలు ఉన్నారు.ప్రస్తుతం 60 మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి చాలా సీరియస్‌గా ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
ప్రభుత్వ స్పందన మరియు పరిహారం
ఈ విషాదంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, రిటైర్డ్ జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించారు.
అలాగే:
- మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం
- గాయపడిన వారికి రూ.1 లక్ష చొప్పున సహాయం ప్రకటించారు
ప్రతిపక్షం విమర్శలు: ప్రభుత్వ భద్రతా వైఫల్యం
ప్రతిపక్ష పక్షాల నుంచి ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి.అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి ఈ ఘోర ఘటనను ప్రభుత్వ భద్రతా విఫలతగా అభివర్ణిస్తూ, మానవ తప్పిదమే ప్రధాన కారణమని దుష్ప్రచారం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: