మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాని(MGNREGA)కి ప్రత్యామ్నాయంగా కొత్త వ్యవస్థను తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించింది. ‘వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ – గ్రామీణ్ (VBGRMG)’ పేరుతో రూపొందించిన ఈ బిల్లు గురువారం సభలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఆమోదం పొందింది.
Read Also: Rammohan Naidu: రామ్మోహన్ నాయుడికి ప్రధాని మోదీ గ్రీటింగ్స్

బిల్లుపై చర్చ ప్రారంభమైనప్పటి నుంచే ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పలువురు ఎంపీలు స్పీకర్ పోడియం వైపు వెళ్లారు. కొందరు ప్రతిపక్ష సభ్యులు బిల్లు ప్రతులను చించి సభలో విసిరేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఈ గందరగోళం మధ్యనే స్పీకర్ మూజువాణి ఓటింగ్ నిర్వహించగా, బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు.
ప్రతిపక్షాల నిరసనల కారణంగా సభలో శాంతిభద్రతలు భంగం చెందడంతో లోక్‌సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. గ్రామీణ ఉపాధి వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావడం, జీవనోపాధి అవకాశాలను విస్తరించడమే ఈ కొత్త చట్టం లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: