हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu news: Vantara – ‘వంతారా’కు భారీ ఊరట..సుప్రీంకోర్టు కమిటీ క్లీన్‌చిట్‌

Sudha
Latest Telugu news: Vantara – ‘వంతారా’కు భారీ ఊరట..సుప్రీంకోర్టు కమిటీ క్లీన్‌చిట్‌

గుజరాత్‌ జామ్‌నగర్‌లోని వన్యప్రాణుల పునరావాస కేంద్రం వంతారాకు (Vantara)భారీ ఊరట
(Huge relief) కలిగింది. సుప్రీంకోర్టు కమిటీ క్లీన్‌చిట్‌ ఇచ్చింది. వంతారాలో నియమాలు, నియంత్రణా చర్యలు పాటించడంపై సిట్‌ సంతృప్తి వ్యక్తం చేసింది. జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌, జస్టిస్‌ పీబీ వరలేలతో కూడిన ధర్మాసనం నివేదికను రికార్డుల్లోకి తీసుకొని.. వంతారాలో నియంత్రణ చర్యల అంశంపై కమిటీ సంతృప్తి వ్యక్తం చేశారని పేర్కొంది. కమిటీ నివేదికను శుక్రవారం సమర్పించగా.. సోమవారం సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించింది. నివేదికను అధ్యయనం చేసిన తర్వాత వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. వంతారాలో చట్టాలను పాటించడం లేదని, విదేశాల నుంచి జంతువులను, ముఖ్యంగా ఏనుగులను స్వాధీనం చేసుకొని తరలిస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

Vantara - ‘వంతారా’కు భారీ ఊరట..సుప్రీంకోర్టు కమిటీ క్లీన్‌చిట్‌
Vantara – ‘వంతారా’కు భారీ ఊరట..సుప్రీంకోర్టు కమిటీ క్లీన్‌చిట్‌

ఈ అంశంపై సుప్రీంకోర్టులో రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు నమోదయ్యాయి. ఆయా పిటిషన్లపై విచారణ సమయంలో పలు మీడియా నివేదికల ఆధారంగా.. ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు ఒక సిట్‌ను ఏర్పాటు చేసింది. ఆగస్టు 25న జస్టిస్‌ జే చలమేశ్వర్‌ నేతృత్వంలో నలుగురు సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో వంతారా (Vantara)లో జంతువులను అక్రమంగా కొనుగోలు చేసినట్లుగా ఆరోపించారు. వన్యప్రాణుల సంరక్షణ, పునరావాసం పేరుతో ఏనుగులు, పక్షులు, ఇతర జాతులను వంతారా (Vantara)కు అక్రమంగా తరలిస్తున్నట్లుగా పేర్కొన్నారు. భారత్‌తో పాటు వివిధ విదేశాల నుంచి జంతువులను తరలిస్తున్నారని.. ముఖ్యంగా ఏనుగులను స్వాధీనం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా.. రిలియన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌, రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వంతారా ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. అనంత్ అంబానీ ఆలోచనలకు అనుగుణంగా జామ్‌నగర్ రిఫైనరీ గ్రీన్‌బెల్ట్‌లో 3వేల ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేశారు. ఇది సాధారణ జంతు ప్రదర్శనశా తరహాలో కాకుండా జంతువులకు సహజ వాతావరణాన్ని కల్పించేలా శాస్త్రీయంగా రూపొందించారు.

వాంతర యజమాని ఎవరు?

అనంత్ అంబానీ స్థాపించిన వంటారా సేవలో పాతుకుపోయింది – వన్యప్రాణులను రక్షించడం, వాటిని కరుణతో పోషించడం.

వంతరా పర్యాటక ప్రదేశాలు?

ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి అడవి జంతువులను రక్షించి, అధునాతన వైద్య చికిత్స, సంరక్షణ మరియు పునరావాసం పొందే ఈ అద్భుతమైన ప్రదేశానికి తీసుకువస్తారు. వంటారా కేవలం పర్యాటక ఆకర్షణ మాత్రమే కాదు . ఇది జంతు సంక్షేమం పట్ల ప్రేమ, శ్రద్ధ మరియు నిబద్ధతను ప్రతిబింబించే ఒక ప్రత్యేకమైన అభయారణ్యం.

వాంతరాలో ఎన్ని ఏనుగులు ఉన్నాయి?

998 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వంటారాలోని రాధే కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్, రక్షించబడిన ఏనుగుల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద సంరక్షణ కేంద్రం. 260+ కంటే ఎక్కువ ఏనుగులకు నిలయంగా ఉన్న ఇది, కలప నరికివేత పరిశ్రమ, వీధి యాచన మరియు సర్కస్‌ల నుండి రక్షించబడిన వారికి సురక్షితమైన స్వర్గధామాన్ని అందిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/mono-train-a-mono-train-stopped-midway-due-to-a-technical-fault/national/547679/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870