జమ్మూ కశ్మీర్ లో రవాణా రంగానికి సంచలనాత్మకంగా మారబోయే ఘట్టం ఇది. వందే భారత్ రైలు ఇప్పుడు హిమాలయాల గర్భంలోకి అడుగుపెట్టబోతోంది. అత్యాధునిక సదుపాయాలతో రూపొందించిన ఈ హైస్పీడ్ ట్రైన్ తాజాగా కత్రా నుండి శ్రీనగర్ వరకు విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ దేశ రవాణా రంగంలో ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది.

కత్రా-శ్రీనగర్ ప్రయాణం –
మొత్తం 272 కిలోమీటర్ల ప్రయాణ దూరాన్ని కేవలం 3 గంటలలో పూర్తిచేసే ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, ప్రస్తుతానికి 6-7 గంటల రోడ్డు ప్రయాణానికి మార్గం చూపనుంది. అత్యున్నత సాంకేతికతతో నిర్మించిన ఈ రైలు సమయం, వేగం, ఆడంబరతనంతో ప్రయాణికులను ఆకట్టుకుంటోంది. ఈ రైలు మార్గంలో అద్భుత నిర్మాణసామర్థ్యం చూపించే అంజి ఖాద్ వంతెన ప్రధాన ఆకర్షణ. ఇది భారతదేశంలో మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైల్వే వంతెనగా గుర్తింపు పొందింది. ఇది కేవలం ఇంజినీరింగ్ అద్భుతం మాత్రమే కాదు, దేశ ఉక్కు శక్తికి నిదర్శనం కూడా. ఇది పూర్తయిన వెంటనే కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా రైలు ప్రయాణం సాధ్యమవుతుంది. ఇది దేశ ఏకీకరణలో మైలురాయి గా నిలిచే అవకాశం ఉంది. విజయవంతమైన ట్రయల్ రన్ తర్వాత, ఈ ప్రాజెక్ట్‌కు అధికారికంగా శ్రీకారం చుట్టేందుకు ఏప్రిల్ 19న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా వందే భారత్ ప్రారంభోత్సవం జరుగుతుంది. దేశమంతటా దృష్టిని ఆకర్షించే ఈ ఘట్టం పర్యాటక రంగానికి, వ్యాపార అభివృద్ధికి నూతన దారులు తెరవనుంది. ఉధంపూర్-శ్రీనగర్ బారాముల్లా రైలు లింక్ (ప్రాజెక్ట్)లోని కాట్రా సంగల్డాన్ సెక్షన్‌లో ఇది చివరి దశ అవుతుంది. దీని తర్వాత, కన్యాకుమారి నుండి కాశ్మీర్‌కు రైలు కనెక్టివిటీ పూర్తవుతుంది. కాట్రా నుండి శ్రీనగర్‌కు రోడ్డు మార్గంలో దాదాపు ఆరు నుండి ఏడు గంటలు పడుతుంది.