ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్‌కు వెళ్లే భక్తులతో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. జనావాసాలపై ఒక్కసారిగా హెలికాప్టర్ అత్యవసరంగా దిగడంతో స్థానికులు భయంతో పరుగులు పెట్టారు. ఈ ఘటనలో ఆ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులతోపాటు ఒక పైలట్ సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో హైవేపై ప్రయాణిస్తున్న ఓ కారు తీవ్రంగా ధ్వంసం అయింది. ఉత్తరాఖండ్(Uttarakhand)లో ఉండే ప్రతికూల వాతావరణం కారణంగా అప్పుడప్పుడు ఇలా హెలికాప్టర్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం సర్వసాధారణమే.
సమస్య తలెత్తినట్లు
ఉత్తరాఖండ్‌లోని బదాసు (సిర్సాయి) నుంచి కేదార్‌నాథ్‌కు బయల్దేరిన ఆ హెలికాప్టర్‌లో ఐదుగురు ప్రయాణికులతోపాటు పైలట్ ఉన్నారు. అయితే ప్రమాదం నుంచి వారంతా సేఫ్‌గా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. కేదార్‌నాథ్(Kedarnath) వెళ్తుండగా హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అలర్ట్ అయిన పైలట్ అకస్మాత్తుగా హైవేపై అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులందరూ క్షేమంగా ఉండటంతో అంతా రిలీఫ్ అయ్యారు.
అత్యవసర ల్యాండింగ్
ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సివిల్ ఏవియేషన్ డెవలప్‌మెంట్ అథారిటీ (యూసీఏడీఏ) స్పందించింది. వెంటనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కి సమాచారం అందించింది. ఈ అత్యవసర ల్యాండింగ్(Emergency landing)కు గల కారణాలపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఘటనపై విచారణ జరిపిన తర్వాత అధికారులు మరిన్ని విషయాలు వెల్లడించనున్నారు.
Read Also: Nasir: బయటపడ్డ పాకిస్థాన్ మాజీ పోలీస్ అధికారి నాసిర్ అసలు బుద్ధి