ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ (Muzaffarnagar)లో ఒక అరుదైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి నుంచి అదృశ్యమైన యువతి చివరికి పోలీస్ స్టేషన్‌కి పెళ్లి దుస్తుల్లో వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తన వరుస చెల్లిని పెళ్లి చేసుకున్నానని ప్రకటించడంతో కుటుంబ సభ్యులు, పోలీసులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.

కుటుంబంలో కలకలం
ఒక యువతి ఇటీవల ఇంటి నుంచి అదృశ్యమవడంతో ఆమె తండ్రి కిడ్నాప్ అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, ఆ యువతి ఎక్కడున్నదో గుర్తించారు. భద్రత హామీతో ఆమెను స్టేషన్‌కు రప్పించారు.
పెళ్లి దుస్తుల్లో పోలీస్ స్టేషన్‌కి
అయితే ఆమె ఒంటరిగా రాలేదు. తన వరుస చెల్లి అయిన మరో యువతిని పెళ్లి (Marrying another woman) దుస్తుల్లో స్టేషన్‌కు తీసుకువచ్చింది. తాము ఇప్పటికే పెళ్లి చేసుకున్నామని, ఇకపై భార్యాభర్తలుగా కలిసి జీవించబోతున్నామనిగా వెల్లడించారు.
ప్రేమకు అడ్డొస్తున్న కుటుంబం
తాము గత ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నామని, కానీ తమ సంబంధాన్ని కుటుంబ సభ్యులు అంగీకరించలేదని, అందుకే పారిపోయి వివాహం చేసుకున్నామని వారు తెలిపారు. అధికారుల ఒత్తిడికి లొంగకుండా తాము తమ నిర్ణయాన్ని మార్చుకోబోమని స్పష్టం చేశారు. పోలీసులు ఈ వ్యవహారాన్ని గౌరవప్రదంగా చూసి, వారి భద్రతకు సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రెండు కుటుంబాల్లో అసహనం ఉన్నా, యువతుల నిర్దిష్ట నిర్ణయాన్ని పోలీసులు గౌరవించారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: