हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Uttar Pradesh: కాలేయంలో పెరుగుతున్న పిండం.. వైద్యులకే సవాలుగా మారిన కేసు

Sharanya
Uttar Pradesh: కాలేయంలో పెరుగుతున్న పిండం.. వైద్యులకే సవాలుగా మారిన కేసు

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లోని మీరట్ నగరంలో జరిగిన ఒక వైద్య విపరీతం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. గర్భాశయంలో కాకుండా, మహిళ కాలేయంలో అభివృద్ధి చెందుతున్న పిండం (developing fetus in liver), వైద్యులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.

డుపు నొప్పి వెనుక అసాధారణ నిజం

బులంద్‌షహర్‌కు చెందిన ఓ మహిళ గత కొన్ని వారాలుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. దీనికి తోడు వాంతులు కూడా రావడంతో ఆమె మీరట్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం కోసం చేరారు. తాను గర్భవతిని అని తెలిసినా, అసాధారణమైన లక్షణాల వల్ల డాక్టర్లు ఆమెకు ఎంఆర్ఐ స్కాన్ చేయించారు.

కాలేయంలో పెరుగుతున్న పిండం – డాక్టర్లు షాక్

ఎంఆర్ఐ ఫలితాలు చూసిన డాక్టర్లకు భారీ షాక్ తగిలింది. గర్భాశయంలో కాకుండా, ఆమె కాలేయంలోనే 12 వారాల పిండం అభివృద్ధి చెందుతోంది! అంతే కాదు, పిండం గుండె కొట్టుకునే శబ్దం కూడా వినిపించిందని డాక్టర్ కె.కె. గుప్తా వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆమెను గైనకాలజిస్ట్ వద్దకు రిఫర్ చేశారు.

ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ?

డాక్టర్ గుప్తా మాట్లాడుతూ ఇది ఇంట్రాహెపాటిక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ (Ectopic pregnancy) అని పేర్కొన్నారు. సాధారణంగా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే గర్భం గర్భాశయంలో కాకుండా వేరే చోట అభివృద్ధి చెందడాన్ని సూచిస్తుంది. ఎక్కువ శాతం ఈ గర్భధారణ ఫలొపియన్ ట్యూబ్‌లలో జరుగుతుంది. కానీ లివర్‌లో అభివృద్ధి చెందడం అత్యంత అరుదైన సందర్భం. “ఇంట్రాహెపాటిక్” అంటే కాలేయం (లివర్) లోనిది. గర్భధారణ సమయంలో ఫలదీకరణం చెందిన గుడ్డు గర్భాశయం బదులు లివర్ మీదే అతుక్కోవడం వల్ల ఇది సంభవిస్తుంది. ఇది చాలా ప్రమాదకరం మరియు తక్షణమే వైద్య దృష్టి అవసరం.

ప్రపంచంలో అరుదైన గర్భధారణ – కేవలం 14 కేసులు మాత్రమే

చరిత్రలో ఇటువంటి లివర్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ కేసులు చాలా అరుదుగా నమోదయ్యాయి. 1954 నుంచి 1999 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా కేవలం 14 కేసులే వెలుగుచూశాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇది అంతర్జాతీయ స్థాయిలో కూడా వైద్య ప్రపంచానికి చర్చనీయాంశంగా మారింది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Sucide: కట్నందాహం ముందు ఓడిన ప్రేమబంధం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870