हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Uttar Pradesh: కాలువలోకి దూసుకెళ్లిన కారు..11 మంది మృతి

Sharanya
Uttar Pradesh: కాలువలోకి దూసుకెళ్లిన కారు..11 మంది మృతి

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) లోని గోండా జిల్లాలో ఆదివారం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. భక్తులతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి సరయూ కాలువలో (Sarayu Canal) పడిపోవడంతో 11 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు.

పూజార్ధంగా ఆలయానికి వెళ్తుండగా విషాదం

సిహగావ్ గ్రామానికి చెందిన 14 మంది భక్తులు ఖర్గుపూర్‌లోని పృథ్వీనాథ్ ఆలయాని (Prithvinath Temple in Khargharpur) కి పూజల కోసం బొలెరో వాహనంలో బయలుదేరారు. మార్గమధ్యంలో, వాహనం అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి సరయూ కాలువలోకి దూసుకెళ్లింది. వాహనం పూర్తిగా నీటిలో మునిగిపోయింది.

Uttar Pradesh: కాలువలోకి దూసుకెళ్లిన కారు..11 మంది మృతి
Uttar Pradesh: కాలువలోకి దూసుకెళ్లిన కారు..11 మంది మృతి

సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇటియాథోక్ పోలీసు స్టేషన్ సిబ్బంది, గ్రామస్థులతో కలిసి వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను నీటిలో నుంచి వెలికితీయగా, చిన్నారులు, మహిళలు సహా 11 మంది అక్కడికక్కడే మృతిచెందినట్లు నిర్ధారించారు. నలుగురు గాయపడినవారిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

జిల్లా ఎస్పీ వినీత్ జైస్వాల్ మాట్లాడుతూ, “బొలెరో వాహనం ఆలయానికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది. 11 మంది మృతి చెందారు. గాయపడిన నలుగురిని ఆసుపత్రికి తరలించాం” అని తెలిపారు.

సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందన

ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను పరామర్శిస్తూ తలా రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతా ద్వారా తెలియజేశారు.

ప్రధానమంత్రి మోదీ స్పందన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ (PMNRF) నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడినవారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందిస్తామని ప్రధాని కార్యాలయం (PMO) ఒక ప్రకటనలో తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/america-indian-origin-family-dies-in-road-accident-in-america/international/525259/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హిడ్మా, శంకర్ వి బూటకపు ఎన్ కౌంటర్లే

హిడ్మా, శంకర్ వి బూటకపు ఎన్ కౌంటర్లే

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

పుతిన్‌కు భగవద్గీతను అందించిన ప్రధాని మోదీ

130వ రాజ్యాంగ సవరణపై JPC తొలి సమావేశం…

130వ రాజ్యాంగ సవరణపై JPC తొలి సమావేశం…

గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధరలు | నేటి రేట్లు…

గుడ్ న్యూస్ భారీగా తగ్గిన బంగారం ధరలు | నేటి రేట్లు…

SIRపై సుప్రీంకోర్టు ఆదేశం: ఇబ్బందుల్లో BLOలను మార్చాలి…

SIRపై సుప్రీంకోర్టు ఆదేశం: ఇబ్బందుల్లో BLOలను మార్చాలి…

నేడు ఇండియా-రష్యా 23వ వార్షిక సమ్మిట్లో పాల్గొనబోతున్న పుతిన్

నేడు ఇండియా-రష్యా 23వ వార్షిక సమ్మిట్లో పాల్గొనబోతున్న పుతిన్

ఇండిగో ఫ్లైట్లు ఇంకా 2–3 రోజులు రద్దు..

ఇండిగో ఫ్లైట్లు ఇంకా 2–3 రోజులు రద్దు..

సిగరెట్ పన్నులు పెరిగేలా కొత్త చట్టం ఆమోదం…

సిగరెట్ పన్నులు పెరిగేలా కొత్త చట్టం ఆమోదం…

ఇండిగోకు షాక్ ఒక్కరోజే 550 ఫ్లైట్లు రద్దు, ఆపరేషన్లు…

ఇండిగోకు షాక్ ఒక్కరోజే 550 ఫ్లైట్లు రద్దు, ఆపరేషన్లు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

పుతిన్ పర్యటన: నేడు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు, మార్గమళ్లింపులు…

ఆంధ్ర తీరంలో మిస్సైల్ పరీక్ష ఏర్పాట్లు!

ఆంధ్ర తీరంలో మిస్సైల్ పరీక్ష ఏర్పాట్లు!

RBI ప్రకటించిన అత్యంత భద్రమైన బ్యాంకులు..

RBI ప్రకటించిన అత్యంత భద్రమైన బ్యాంకులు..

📢 For Advertisement Booking: 98481 12870