ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీని కారణంగా యమునా నది (Yamuna River) ఉప్పొంగి ప్రవహిస్తోంది. నదిలో నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయినప్పటికీ వరద ఉద్ధృతి తగ్గడం లేదు.
యమునా నదిలో పెరిగిన నీటిమట్టం వల్ల ఢిల్లీ(Delhi)లోని పునరావాస కేంద్రాలు కూడా నీటమునిగాయి. దీంతో ప్రజలు మరింత ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు, సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఢిల్లీలో మరిన్ని ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది. సహాయక చర్యల కోసం అధికార యంత్రాంగం అదనపు బృందాలను రంగంలోకి దించింది. వర్షాలు తగ్గేంత వరకు ప్రజలు సురక్షితంగా ఉండాలని, నది తీర ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.