దేశంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పీహెచ్‌డీ ప్రవేశాలు, జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ , మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హతను నిర్దారించేందుకు ప్రతి ఏడాది రెండు సార్లు యూజీసీ నెట్ పరీక్ష నిర్వహించబడుతుంది. జూన్, డిసెంబర్ నెలల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 2025 జూన్ సెషన్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

దరఖాస్తు వివరాలు
ఈ పరీక్షకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 2025 ఏప్రిల్ 16న ప్రారంభమైంది. అభ్యర్థులు మే 15, 2025 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దరఖాస్తులో ఏవైనా తప్పులుంటే, వాటిని మే 9 నుండి మే 10 మధ్య సరిదిద్దుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు వివరాలు:
- జనరల్ (ఓసీ) అభ్యర్థులకు – ₹1150
- ఓబీసీ (NCL), ఈడబ్ల్యూఎస్ (EWS) – ₹600
- ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, థర్డ్ జెండర్ – ₹325
పరీక్షకు సంబంధించి ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే, అభ్యర్థులు 011-40759000 లేదా 011-69227700 నంబర్లకు ఫోన్ చేయవచ్చు లేదా అధికారిక మెయిల్ [email protected]కి మెయిల్ చేయవచ్చు. మాస్టర్స్ డిగ్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులై అభ్యర్ధులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ- ఎన్‌సీఎల్/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. జేఆర్‌ఎఫ్‌కు దరఖాస్తు చేసుకునే వారికి 30 ఏళ్లు మించకుండా ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి ఉండదు.
పరీక్ష తేదీలు
యూజీసీ నెట్ జూన్ 2025 ఆన్‌లైన్ రాత పరీక్షలు జూన్ 21 నుంచి ప్రారంభం అవుతాయని ఎన్‌టీఏ ప్రకటించింది. ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) రూపంలో ఉంటుంది. మొత్తం రెండు పేపర్లుగా పరీక్షను నిర్వహిస్తారు. రెండు పేపర్లూ ఒకే సెషన్‌లో నిర్వహించబడతాయి మరియు పరీక్ష వ్యవధి 3 గంటలు ఉంటుంది. ఈ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు ఉంటుంది. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయిస్తారు. పేపర్ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది. పేపర్ 1లో రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైరెర్జంట్ థింకింగ్, జనరల్ అవేర్‌నెస్‌పై ప్రశ్నలు అడుగుతారు. పేపర్ 2లో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్ట్ ఆధారంగా ప్రశ్నలు వస్తాయి.