Udayanidhi Stalin : సనాతన ధర్మంపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను మద్రాస్ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఉదయనిధి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
ఉదయనిధి ఉపయోగించిన భాష కేవలం ఒక వ్యక్తిగత అభిప్రాయం కాదని, అది జాతి నిర్మూలనను సూచించేలా ఉందని కోర్టు అభిప్రాయపడింది. సనాతన ధర్మాన్ని ఒక మతంగా పరిగణిస్తే, ఆ మతాన్ని అనుసరించే వారు ఉండకూడదని చెప్పడం మతహత్యకు పిలుపునిచ్చినట్టేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు ద్వేషపూరిత ప్రసంగానికి సమానమని పేర్కొంది.
Read Also: WPL 2026: ముంబై పై ఢిల్లీ గెలుపు
సోషల్ మీడియాలో వాడిన పదాలు మత, సాంస్కృతిక విధ్వంసాన్ని (Udayanidhi Stalin) సూచిస్తున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ తరహా వ్యాఖ్యలను సాధారణ విమర్శలుగా పరిగణించలేమని స్పష్టం చేసింది.
అదే సమయంలో, ఉదయనిధి వ్యాఖ్యలను విమర్శించినందుకు బీజేపీ నేత అమిత్ మాలవీయపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను మద్రాస్ హైకోర్టు రద్దు చేసింది. మంత్రి వ్యాఖ్యలకు ప్రతిస్పందించడం నేరం కాదని, ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చట్టాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: