వాహన యజమానులు, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు తమ మొబైల్ నంబర్ వివరాలను తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని కేంద్ర రవాణా శాఖ మరోసారి స్పష్టం చేసింది. డిజిటలైజేషన్ పెరిగిన నేపథ్యంలో వాహనాలకు(Traffic Rules) సంబంధించిన దాదాపు అన్ని సేవలు మొబైల్ నంబర్ ఆధారంగానే అందుతున్నాయని అధికారులు గుర్తుచేశారు.
Read Also: BSNL New Year offer: బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్.. రూ.251కే

ప్రస్తుతం చాలా మంది వాహనదారులు నంబర్ మార్చుకున్నప్పటికీ, అధికారిక రికార్డుల్లో పాత నంబర్లనే కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. దీని వల్ల ట్రాఫిక్(Traffic Rules) ఉల్లంఘనలపై విధించే ఈ-చలాన్లు, ఇన్సూరెన్స్ పాలసీ గడువు ముగింపు సమాచారం, పీయూసీ, ఫిట్నెస్ సర్టిఫికెట్ రీన్యువల్ నోటిఫికేషన్లు వారికి చేరడం లేదని తెలిపారు. ఫలితంగా ఆలస్యంగా ఫైన్లు పెరగడం, లీగల్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించారు.
వాహన్, సారథి పోర్టల్స్‌లో సులభంగా అప్డేట్ అవకాశం
ఈ సమస్యను నివారించేందుకు వాహన్ (Vahan), సారథి (Sarathi) అధికారిక వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వాహన ఆర్సీ నంబర్, ఛాసిస్ నంబర్, ఇంజిన్ నంబర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వివరాలతో ఆన్‌లైన్‌లోకి లాగిన్ అయి మొబైల్ నంబర్‌ను స్వయంగా అప్డేట్ చేసుకోవచ్చని తెలిపారు. ప్రత్యేకంగా ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేశారు.
అలాగే భవిష్యత్తులో వాహనానికి సంబంధించిన ఏ చిన్న సమాచారం అయినా మొబైల్ నంబర్‌కే వస్తుందని, కాబట్టి సరైన నంబర్ ఉండటం చాలా కీలకమని అధికారులు సూచిస్తున్నారు. వాహన భద్రత, చట్టపరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ప్రతి వాహనదారుడు వెంటనే ఈ అప్డేట్ పూర్తి చేసుకోవాలని కేంద్ర రవాణా శాఖ విజ్ఞప్తి చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: