దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రతిరోజూ లక్షల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తున్నాయి. సాధారణంగా ప్రతి టోల్(Toll Roles) ప్లాజా వద్ద వాహనదారులు టోల్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ చాలా మందికి తెలియని ఒక ప్రత్యేక మినహాయింపును జాతీయ రహదారుల అథారిటీ (NHAI) అందిస్తోంది.
టోల్ ప్లాజా నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే వారికి టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ సౌకర్యం స్థానిక ప్రజలు, రోజువారీ ప్రయాణీకులు, అత్యవసర సేవ వాహనాలకు పెద్ద ఉపశమనంగా మారుతోంది. స్థానిక ప్రయాణాల భారం తగ్గించడానికి NHAI ఈ నిబంధనను ప్రవేశపెట్టింది.
Read Also: Elon Musk: ఎయిర్ టెల్, జియోతో స్టార్‌లింక్ పోటీ కష్టమేనా?

20 కిలోమీటర్ల నియమం (20-km Rule) అంటే ఏమిటి?
NHAI టోల్ నియమాల ప్రకారం, వాహనదారుడి నివాస చిరునామా టోల్ ప్లాజా నుండి 20 కి.మీ. లోపల ఉంటే, వారు టోల్ చార్జీలకు మినహాయింపు పొందగలరు. ఈ ప్రయోజనం పొందడానికి
ఆధార్, ఓటర్ కార్డు, కరెంట్ బిల్ లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పత్రం వంటి సరైన అడ్రెస్ ప్రూఫ్ సమర్పించాలి.
ఈ మినహాయింపు ‘Pay As You Use’ పద్ధతిలో అమలు అవుతోంది. దీని కోసం GNSS ఆధారిత ట్రాకింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. డిజిటల్ టోల్ విధానాన్ని ప్రోత్సహించడం, స్థానికులకు ఆర్థిక ఉపశమనం అందించడం దీని ప్రధాన ఉద్దేశం.
ఇక స్థానిక నివాసితులతో పాటు కొన్ని ప్రత్యేక వర్గాల వాహనాలకు కూడా టోల్‌ను పూర్తిగా మాఫీ చేశారు. ముఖ్యంగా:
- కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వ వాహనాలు
- పోలీసు వాహనాలు
- అంబులెన్సులు
- అగ్నిమాపక దళ వాహనాలు
- సైన్యం, నౌకాదళం, వైమానిక దళ వాహనాలు
- NDRF సహాయక కార్యకలాపాల్లో ఉపయోగించే వాహనాలు
అత్యవసర సమయంలో టోల్ వద్ద సమయం వృథా కాకుండా ఉండడం కోసం ఈ మినహాయింపులు అమల్లోకి వచ్చాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: