తీహార్ జైలు(Tihar Jail) అంటే ఒకప్పుడు కేవలం కారాగారం కాదు, నేరస్తుల జీవితాల్లో మార్పుకు వేదికగా నిలిచిన ప్రాంగణం. ఖైదీల ప్రవర్తనలో సానుకూల మార్పులు తీసుకురావడంలో ఈ జైలు కీలక పాత్ర పోషించింది. దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద కారాగార సముదాయంగా గుర్తింపు పొందిన తీహార్ జైలు, ఖైదీల సంస్కరణ కేంద్రంగా దేశవ్యాప్తంగా పేరొందింది. ఐపీఎస్ అధికారి కిరణ్ బేడీ హయాంలో అమలైన సంస్కరణలతో దీనికి ‘తీహార్ ఆశ్రమం’ అనే పేరూ వచ్చింది.
Read Also: Sai S Jadhav: ఐఎంఏ చరిత్రలో తొలి మహిళా ఆఫీసర్

తీహార్ జైలు చరిత్ర – ఒక గ్రామం లాంటి సముదాయం
పశ్చిమ న్యూఢిల్లీలో 1958లో ఏర్పాటు చేసిన తీహార్ జైలు ఒకే భవనం కాదు, అనేక కేంద్ర జైళ్లతో కూడిన విస్తృత సముదాయం. మొదట 1,273 మంది ఖైదీల కోసం నిర్మించిన ఈ జైలు, ప్రారంభంలో పంజాబ్ ప్రభుత్వ పరిపాలనలో ఉండేది. 1966లో ఢిల్లీ పరిపాలనకు బదిలీ అయ్యింది. కాలక్రమేణా ఇది దేశంలోనే అతిపెద్ద, ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే జైళ్లలో ఒకటిగా మారింది.
సామర్థ్యానికి మించిన ఖైదీల రద్దీ
ప్రస్తుతం తీహార్ జైలు (Tihar Jail)సముదాయంలో CJ-1 నుంచి CJ-10 వరకు 10 కేంద్ర జైళ్లు ఉన్నాయి. అధికారికంగా సుమారు 10 వేల మంది ఖైదీలను ఉంచే సామర్థ్యం ఉన్నప్పటికీ, వాస్తవంగా 15 వేల నుంచి 19 వేల మందికి పైగా ఖైదీలు ఉంటున్నారు. ఈ అధిక రద్దీ జైలు నిర్వహణ, భద్రత పరంగా పెద్ద సవాలుగా మారింది. శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, విచారణలో ఉన్నవారు, మహిళా ఖైదీలకు ప్రత్యేక విభాగాలు ఉన్నాయి.
కిరణ్ బేడీ తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు
1990లలో కిరణ్ బేడీ(Kiran Bedi) జైళ్ల ఇన్‌స్పెక్టర్ జనరల్‌గా ఉన్న సమయంలో తీహార్ జైలులో విస్తృత మార్పులు చోటు చేసుకున్నాయి. యోగా, ధ్యానం, వృత్తి విద్య, విద్యా కార్యక్రమాలు వంటి మానవతా సంస్కరణలు అమలు చేయడంతో ఖైదీల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఈ చర్యల వల్ల తీహార్ జైలు కేవలం శిక్షల కేంద్రం కాకుండా, పునరావాసం మరియు సంస్కరణలకు నిలయంగా మారింది.
జైలు తరలింపుపై ప్రభుత్వం ఆలోచన
ఇటీవల ఖైదీల సంఖ్య పెరగడం, భద్రతా సమస్యలు, ఖైదీల మధ్య హింసాత్మక ఘటనలు, గ్యాంగ్ వార్‌లు పెరగడం వంటి కారణాలతో తీహార్ జైలును నగర శివార్లకు తరలించాలన్న ఆలోచన తెరపైకి వచ్చింది. నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉండటంతో ప్రజల భద్రత దృష్ట్యా, జైలును నరేలా ప్రాంతానికి తరలించే అంశాన్ని ఢిల్లీ ప్రభుత్వం పరిశీలిస్తోంది. మౌలిక సదుపాయాల మెరుగుదలలో భాగంగానే ఈ ప్రతిపాదన వచ్చినట్లు ముఖ్యమంత్రి రేఖా గుప్తా వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: