हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Elections: ఎన్నికల్లో 3 కీలక చర్యలు ప్రకటించిన కమిషన్

Anusha
Elections: ఎన్నికల్లో 3 కీలక చర్యలు ప్రకటించిన కమిషన్

భారతదేశంలో ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టం చేసే దిశగా భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక అడుగులు వేసింది.ఓటర్లకు అందించే సేవలను సులభతరం చేయడమే లక్ష్యంగా మూడు ప్రధాన సంస్కరణలను ప్రకటించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్లు డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, డాక్టర్ వివేక్ జోషిల నేతృత్వంలో జరిగిన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ల (సిఈఓ) సమావేశం అనంతరం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఈసీఐ గురువారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించింది.

జాబితా

ఓటర్ల జాబితాలో తరచూ తలెత్తే సమస్యల్లో ఒకటైన మరణించిన వారి పేర్లను సమర్థవంతంగా తొలగించేందుకు ఈసీఐ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వద్ద నమోదైన మరణాల వివరాలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో నేరుగా సేకరిస్తారు. ఈ సమాచారం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లకు (ఈఆర్ఓ) అందుతుంది. అనంతరం బూత్ లెవల్ అధికారులు (బిఎల్ఓ) క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, ఆ వివరాలను ధృవీకరించుకుంటారు. దీనివల్ల, ఫారం 7 ద్వారా అధికారికంగా దరఖాస్తు అందే వరకు వేచి చూడకుండా, మరణించిన వారి పేర్లను జాబితా నుంచి సత్వరమే తొలగించడానికి వీలవుతుంది. 1960 నాటి ఓటర్ల నమోదు నిబంధనల్లోని రూల్ 9, జనన మరణాల నమోదు చట్టం-1969 (2023 సవరణ) లోని సెక్షన్ 3(5)(బి)లకు అనుగుణంగా ఈ మార్పు చేసినట్లు ఈసీఐ తెలిపింది. ఈ చర్యతో ఓటర్ల జాబితా మరింత కచ్చితంగా మారుతుందని భావిస్తున్నారు.

 Elections: ఎన్నికల్లో  3 కీలక చర్యలు ప్రకటించిన కమిషన్

పోలింగ్

ఓటర్లకు పోలింగ్ కేంద్రం, ఇతర వివరాలను సులభంగా గుర్తించేందుకు వీలుగా ఓటర్ సమాచార స్లిప్ (విఐఎస్) ను ఈసీఐ పునఃరూపకల్పన చేసింది. కొత్త స్లిప్పులో ఓటరు సీరియల్ నంబర్, పార్ట్ నంబర్ వంటి వివరాలను పెద్ద అక్షరాలతో ముద్రిస్తారు. దీనివల్ల ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్‌ను తేలికగా గుర్తించడంతో పాటు, పోలింగ్ అధికారులు కూడా ఓటర్ల జాబితాలో వారి పేరును వేగంగా కనుగొనడానికి వీలవుతుందని ఈసీఐ పేర్కొంది.ఓటర్లకు, ఎన్నికల సంఘానికి మధ్య వారధిగా పనిచేసే బూత్ లెవల్ అధికారుల (బిఎల్ ఓ) పనితీరును మరింత మెరుగుపరిచేందుకు, వారికి ప్రజల్లో గుర్తింపు పెంచేందుకు ఈసీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్ 13బి(2) కింద నియమితులైన బీఎల్వోలందరికీ ఇకపై ప్రామాణిక ఫోటో గుర్తింపు కార్డులను జారీ చేయాలని ఆదేశించింది. ఇంటింటి సర్వే, ఓటరు నమోదు, పరిశీలన వంటి కార్యక్రమాల సమయంలో బీఎల్వోలను ప్రజలు సులభంగా గుర్తించేందుకు ఈ కార్డులు ఉపయోగపడతాయని, తద్వారా వారి మధ్య విశ్వాసం పెరిగి, ఎన్నికల ప్రక్రియ మరింత సజావుగా సాగుతుందని ఈసీఐ విశ్వాసం వ్యక్తం చేసింది.

Read Also: PM Modi: ప్రతిభ, సృజనాత్మకతలకు వేవ్స్‌ పునాది: ప్రధాని మోదీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870