ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET)పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మూలంగా ఎంత మంది ఇన్సర్వీస్ ఉపాధ్యాయులు నష్టపోతున్నారో వివరాలు ఇవ్వాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు రాష్ట్రాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శులకు కేంద్ర పాఠశాల విద్య శాఖ జాయింట్ సెక్రటరీ లేఖలు రాశారు. నష్టపోయే ఉపాధ్యాయుల వివరాలను ఈ నెల 16లోగా కేంద్రానికి సమర్పించాలని లేఖలో పేర్కొన్నారు. అలాగే సమస్య పరిష్కారానికి గల న్యాయపరమైన అవకాశాలను కూడా తెలియజేయాలని లేఖలో కోరారు.
Read also: Telangana: పేపర్ లీక్.. నలుగురు అధికారులు సస్పెండ్?
టెట్పై సుప్రీం కోర్టు(Supreme Court) తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో సుమారు 40వేల మందికి పైగా ఇన్ సర్వీస్ టీచర్లు ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సుప్రీం కోర్టు టెట్ తప్పనిసరి అని చెప్పడంతో ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న టెట్-2026 పరీక్షలకు ఇన్సర్వీస్ ఉపాధ్యాయుల నుంచి 71వేలకి పైగా దరఖాస్తులు వచ్చాయి. వారు ప్రస్తుతం పరీక్షలకు హాజరవుతున్నారు. టెట్ పై సుప్రీం కోర్టు తీర్పు కారణంగా రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంతమంది ఉపాధ్యాయులు ప్రభావితం అవుతున్నారో వివరాలు ఇవ్వాలని, పరిష్కారానికి గల న్యాయపరమైన అవకాశాలను జనవరి 16 లోపు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ లేఖ రాసింది.

టెట్పై సుప్రీం కోర్టు ఏమిటంటే.. సమస్య పరిష్కారానికి న్యాయసలహా కోరిన కేంద్రం రాష్ట్రం నుంచి 40వేల మందికిపైగా ఉపాధ్యాయులు గత ఏడాది సెప్టెంబరు 1న సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు ప్రకారం.. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని తీర్పును వెలువరించింది. తీర్పు ఇచ్చిన తర్వాత రెండేళ్లలో అంటే 2027 నాటికి టెట్ ఉత్తీర్ణులు కావాలని పేర్కొంది. టెట్ ఉత్తీర్ణత కాని పక్షంలో ఉద్యోగం వదులుకోవల్సి ఉంటుందని తెలిపింది.
అయితే ఐదేళ్లలో పదవీ విరమణ చేయబోయే వారికి మాత్రం టెట్ అవసరం లేదని చెబుతూనే.. వారు పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాసవ్వాలని స్పష్టం చేసింది. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం మార్చి 31, 2010 కంటే ముందు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి టెట్ అవసరం లేదని ఎన్సిసిటిఈ గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్నప్పటికీ.. దానిని పరిగణన లోకి తీసుకోకుండా సుప్రీంకోర్టు గత ఏడాది(2025) సెప్టెంబర్ 1న టెట్ తప్పనిసరి అంటూ తీర్పు వెలువరించిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
2010 కంటే ముందు ఉన్న వారికి టెట్ అవసరం లేకపోవడంతో.. వారు ఉపాధ్యాయ వృత్తిలో చేరారు. ఉపాధ్యాయులుగా ఇప్పటికే 15 సంవత్సరాలు అంతకంటే ముందు టీచర్లుగా నియమితులైన వారు అయితే సుమారు 20 నుంచి 25 సంవత్స రాలుగా కొనసాగుతున్నారు. వారిలో సర్వీస్ మరో 10 నుంచి 12 ఏళ్ల వరకు ఉన్న వారు సైతం ఉన్నవారు ఉన్నారు. ఇప్పటికే 25 సంవత్సరాలకు పైగా టీచింగ్ వృత్తిలో ఉన్నవారు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇపుడు టెట్ పరీక్షలకు హాజరవుతున్నారు. ఈ నెల 3 నుంచి జరుగుతున్న టెట్ పరీక్షలకు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయల నుంచి 71670 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే పాఠాలు బోధిస్తున్న వారి నుంచి పేపర్-1 పరీక్షకి 15,672 మంది, పేపర్-2 పరీక్షకి 33,564 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు పేపర్లకి కలిపి 11,719 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా ప్రభుత్వం టీచర్ల నుంచి 60,955 వచ్చాయి. టెట్-2026కి దరఖాస్తు గడువు లోపు పేపర్-1కి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల నుంచి 27,389 దరఖాస్తులు రాగా.. 25-25 44,281 దరఖాస్తులు వచ్చాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: