హైదరాబాద్: తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య విద్య, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించాలంటూ పార్లమెంట్లో వరంగల్ఎంపీ డాక్టర్ కడియం కావ్య(Dr.Kadiyam Kavya) ప్రశ్నించారు. ప్రధానంగా గ్రామీణ మెడికల్ కళాశాలల్లో డాక్టర్లు మరియు సిబ్బంది, అధ్యాపకుల నియామకాలు, ల్యాబ్స్, లైబ్రరీలు, హాస్టళ్లు, వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ టూల్స్ గ్రామీణ సేవలకు ప్రోత్సాహకాలు వంటి అంశాలపై వరంగల్ ఎంపీ వివరణ కోరారు. లోక్ సభలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అడిగిన కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి అను ప్రియా పటేల్(Anupriya Patel) సమాధానం ఇచ్చారు.

ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ మిషన్ కింద రూ.208.82 కోట్లు
కొత్త మెడికల్ కళాశాలల్లో అవసరమైన మోలిక సదుపాయాలు 2023 నిబంధనల ప్రకారం తప్పనిసరి చేస్తూ అధ్యాపకుల హాజరు ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. 2024-25లో ఎన్హెచ్ ఎం కింద తెలంగాణకు రూ.67.16 కోట్లు, ప్రధాన్మంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ మిషన్ కింద రూ.208.82 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దూర ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్లకు ప్రత్యేక భత్యాలు, నిపుణులకు గౌరవ వేతనాలు ఇస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణలోని 9 మెడికల్ కళాశాలలకు 511 పిజి సీట్లు
అలాగే, కేంద్ర పథకం కింద తెలంగాణలోని 9 మెడికల్ కళాశాలలకు 511 పిజి సీట్లు మంజూర య్యాయని తెలిపారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్కు 92 సీట్లు కు మొదటి దశ 89 సీట్లకు రూ.7.47 కోట్లు విడుదల చేయగా, రెండో దశలో 3 సీట్లకు రూ.2.15 కోట్లు విడుదల చేసినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్రామీణ మెడికల్ కళాశాలల్లో సదుపాయాలను కల్పించడంతో పాటు సిబ్బంది. కొరత లేకుండా చూడాలని ఎంపీ కోరారు. మెడికల్ కళాశాలలకు మరిన్ని ప్రత్యేక నిధులు కేటాయించాలని ఎంపి డాక్టర్ కడియం కావ్య విజప్తి చేశారు.
అనుప్రియ పటేల్ ఎవరు?
అనుప్రియ సింగ్ పటేల్ (జననం 28 ఏప్రిల్ 1981) ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక భారతీయ రాజకీయ నాయకురాలు, ఉపాధ్యాయురాలు మరియు సామాజిక కార్యకర్త, ఆమె 2016 నుండి అప్నా దళ్ (సోనీలాల్) పార్టీకి అధ్యక్షురాలిగా మరియు 7 జూలై 2021 నుండి 4 జూన్ 2024 వరకు భారత వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.
అనుప్రియ పటేల్ వివాహం చేసుకున్నారా లేదా?
ఆయన అప్నా దళ్ (సోనేలాల్) పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ భర్త.
Read hindi news: hindi.vaartha.com
Read Also :