తమిళనాడు (TamilNadu) రాజకీయాల్లో సినీ నటుడు, టీవీకే (TVK) చీఫ్ విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తామని విజయ్ ధీమా వ్యక్తం చేయడంతో, దీనిపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఘాటుగా స్పందించారు. విజయ్ కింగ్ కాదని, కేవలం ఓట్లను చీల్చుతారని విమర్శించారు. ఆ పార్టీతో BJP పొత్తు పెట్టుకునే అవకాశమే లేదన్నారు. గతంలో ఎంతో మంది సినీ స్టార్లు పాలిటిక్స్‌లోకి వచ్చారని, కానీ విఫలమయ్యారని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో BJP, AIADMK కలిసే పోటీ చేస్తాయని తెలిపారు.
Read Also: Madhya Pradesh: ఆడబిడ్డకు జన్మనిచ్చిన 13 ఏళ్ల బాలిక

Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: