దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు (Corona Cases ) మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో, తమిళనాడు ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అప్రమత్తమైంది. ప్రజలు ఎక్కువగా కలిసికట్టుగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేయాలని సూచించింది. అలాగే, సామాజిక దూరం పాటించడం, శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి నియమాలను గట్టిగా అమలు చేయాలని ప్రభుత్వ అధికారి తెలిపారు.
ఆసుపత్రులకు తాజా ఆదేశాలు – సమగ్ర సన్నద్ధత
తమిళనాడు (Tamil Nadu Govt) రాష్ట్ర ఆరోగ్య శాఖ జిల్లా ఆసుపత్రులకు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆసుపత్రులలో ప్రస్తుత మందుల నిల్వలు, రోగనిర్ధారణ పరికరాల లభ్యత, ఆక్సిజన్ మద్దతు, ఐసీయూ పడకల సంఖ్య తదితర వైద్య సౌకర్యాలపై పూర్తి వివరాలను సేకరించమని తెలియజేసింది. రోగుల సంఖ్య పెరిగిన సందర్భంలో ఎలాంటి అకాల సమస్యలు తలెత్తకుండా ముందస్తు సన్నద్ధతకు చర్యలు చేపట్టాలని సూచనలిచ్చింది.
కేసుల పెరుగుదలపై అధికారులు అప్రమత్తం
తమిళనాడులో గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 37 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 185 యాక్టివ్ కేసులు ఉన్నట్లు సమాచారం. కరోనా కేసులలో ఇంతపెచ్చు నమోదు కావడంతో, ప్రజలు నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని హెచ్చరించారు. ముఖ్యంగా వయసైనవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలంటూ అధికారులు హితవు పలికారు.
Read Also : Karun Nair : ద్విశతకంతో అదరగొట్టిన కరుణ్ నాయర్