తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే వ్యవస్థాపకుడు ఎం. కరుణానిధి (M. Karunanidhi) విగ్రహ ఏర్పాటు అంశంలో సుప్రీంకోర్టు స్పష్టమైన, కఠినమైన వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ నిధులను ఉపయోగించి రాజకీయ నాయకుల కీర్తిని ప్రజల ముందుకు చాటే ప్రయత్నాలు అనుచితమని, పౌరుల డబ్బును ఈ విధంగా ఉపయోగించడం సముచితం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డది.
ఈ క్రమంలోనే ప్రజల సొమ్ముతో కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్న ఎంకే స్టాలిన్ (MK Stalin) నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు తీవ్రంగా ఆగ్రహించింది. ఈ సందర్భంగా విగ్రహాల ఏర్పాటుపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించిన సుప్రీంకోర్టు..

ఈ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలని
ఈ వ్యవహారంలో విగ్రహం ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వం పెట్టుకున్న పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలని సూచించింది. ఈ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు (Madras High Court) ను ఆశ్రయించాలని స్టాలిన్ సర్కార్‌కు తెలిపింది.తిరునల్వేలి జిల్లాలోని ప్రధాన రహదారిపై వల్లీయూర్ డైలీ వెజిటేబుల్ మార్కెట్ మెయిన్ గేట్ వద్ద కరుణానిధి కాంస్య విగ్రహం (Bronze statue of Karunanidhi) తోపాటు.. నేమ్ బోర్డు ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును స్టాలిన్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు.. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దాన్ని తీవ్రంగా ఖండించింది.
కరుణానిధి విగ్రహం పెట్టడం సరైనదేనా ?
Read hindi news: hindi.vaartha.com
Read Also: