हिन्दी | Epaper

Constable bribe case : లంచం కేసులో కానిస్టేబుల్‌కు శిక్ష తగ్గించిన సుప్రీంకోర్టు

Sai Kiran
Constable bribe case : లంచం కేసులో కానిస్టేబుల్‌కు శిక్ష తగ్గించిన సుప్రీంకోర్టు

Constable bribe case : 36 సంవత్సరాల క్రితం జరిగిన రూ.500 లంచం కేసులో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్‌కు విధించిన జైలు శిక్షను సుప్రీంకోర్టు తగ్గించింది. ట్రయల్ కోర్టు అతనికి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించగా, సుప్రీంకోర్టు తాజాగా ఆ శిక్షను ఒక సంవత్సరానికి తగ్గిస్తూ తీర్పు ఇచ్చింది.

ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ 1990లో రూ.500 లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఉదమ్ సింగ్ నగర్ జిల్లాలో అతనిపై కేసు నమోదైంది. అనంతరం 2006లో సెషన్స్ కోర్టు అతడిని దోషిగా తేల్చి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

హైకోర్టు తీర్పు

ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆ కానిస్టేబుల్ ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే 2012లో హైకోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.

దీనితో అతను సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతడి అప్పీల్‌పై జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ పీబీ పరాలేల్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

Read Also: Indian LPG Ships : ఇరాన్ టెన్షన్ మధ్య భారత్‌కు LPG నౌకలు చేరువ

Constable bribe case
Constable bribe case

శిక్ష తగ్గించిన సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించినప్పటికీ శిక్ష విషయంలో కొంత ఉపశమనం కల్పించింది. ప్రస్తుతం ఆ కానిస్టేబుల్ వయస్సు 75 సంవత్సరాలు కావడంతో పాటు ఇప్పటికే రెండు నెలలు జైల్లో గడిపిన విషయాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

ఈ నేపథ్యంలో అతనికి విధించిన రెండేళ్ల జైలు శిక్షను ఒక సంవత్సరానికి తగ్గిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.

hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870