हिन्दी | Epaper

Supreme Court: హరీశ్ రాణాకు కారుణ్య మరణానికి అనుమతినిచ్చిన సుప్రీంకోర్టు

Vanipushpa
Supreme Court: హరీశ్ రాణాకు కారుణ్య మరణానికి అనుమతినిచ్చిన సుప్రీంకోర్టు

సంచలన తీర్పు వెలువరించింది సర్వోన్నత న్యాయస్థానం. జీవచ్ఛవంలా మారిన అతడికి చికిత్సను నిలిపివేయాలని ఆదేశించింది. ఈ కేసు విచారణలో భాగంగా తీర్పు చదివే సమయంలో న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దివాలా భావోద్వేగానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో అసలెవరీ హరీశ్ రాణా? ఏమిటీ కేసు.? దేశంలోనే తొలి కారుణ్య మరణం పొందిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోనున్న హరీశ్ రాణా(Harish Rana) కేసు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు చెందిన 32 ఏళ్ల హరీశ్ రాణా చండీగఢ్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతుండేవాడు. అతడు 2013 ఆగస్టు 20న హాస్టల్లో ప్రమాదవశాత్తూ నాలుగో అంతస్తు బాల్కనీ నుంచి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. శరీరం కదల్లేని స్థితికి చేరుకుంది. ప్రముఖ ఆసుపత్రుల్లో చికిత్స అందించినా.. అతడి హెల్త్ కండీషన్‌లో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ప్రమాదానికి గురైన నాటి నుంచీ అతడు కోమాలోనే ఉండిపోయాడు. ఇన్నేళ్లుగా అతడి తల్లిదండ్రులు హరీశ్‌ను చూసుకుంటూ.. ఆర్థికంగా, మానసికంగా బాగా చితికిపోయారు.

Read Also: Iran accusations in UN: సమితిలో ఇరాన్ సంచలన ఆరోపణలు: ఇజ్రాయెల్ వైఖరిపై తీవ్ర నిరసన

Supreme Court: Supreme Court allows euthanasia for Harish Rana
Supreme Court: Supreme Court allows euthanasia for Harish Rana

సుప్రీంకోర్టు నిరాశే ఎదురైంది

ఈ నేపథ్యంలో హరీశ్ తల్లిదండ్రులు 2024 జులైలో కుమారుడి కారుణ్య మరణానికి అనుమతించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. హరీశ్ వెంటిలేటర్‌పై ఆధారపడటం లేదని, కేవలం ట్రాకియోస్టమీ ట్యూబ్(శ్వాస కోసం), గాస్ట్రోస్టమీ ట్యూబ్(ఆహారం కోసం) వాడుతున్నాడని పేర్కొంది. ఫీడింగ్ ట్యూబ్ తొలగిస్తే ఆకలితో మరణం సంభవిస్తుందని, అది యాక్టివ్ యూతనేషియా అవుతుందని వ్యాఖ్యానిస్తూ.. ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు(Supreme Court)కు వెళ్లినా.. అక్కడా నిరాశే ఎదురైంది. హరీశ్‌ కోలుకునే అవకాశం ఏమాత్రం లేదని వైద్యులు మరోసారి స్పష్టమైన నివేదికలు ఇవ్వడంతో.. వాటి ఆధారంగా మరోసారి వారు సుప్రీం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఈ ఏడాది జనవరి 13న హరీశ్ తల్లిదండ్రులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మానవీయకోణంలో మర్యాదపూర్వక మరణాన్ని ప్రసాదించాలని వారు కోర్టును వేడుకున్నారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ కేసు విచారణలో సర్వోన్నత న్యాయస్థానం బుధవారం నాడు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 13 ఏళ్లుగా జీవచ్ఛవంలా ఉన్న హరీశ్ రాణాకు కారుణ్య మరణానికి(పాసివ్ యూతనేషియా) అనుమతించింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870