భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పాఠశాల విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు ‘యువ విజ్ఞాని కార్యక్రమం’ (YUVIKA – 2026) పేరుతో అద్భుతమైన అవకాశాన్ని ప్రకటించింది. అంతరిక్ష సాంకేతికత, స్పేస్ సైన్స్ మరియు దాని అనువర్తనాలపై చిన్న వయసులోనే అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులను ప్రోత్సహిస్తూ, వారిని సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మరియు గణితం (STEM) రంగాల వైపు మళ్ళించేందుకు ఇస్రో ఈ ప్రతిష్టాత్మక వేదికను సిద్ధం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
Telangana Collectors Meeting: పలువురు కలెక్టర్లపై సీఎం రేవంత్ ఆగ్రహం
ఈ ఎంపిక ప్రక్రియలో విద్యార్థుల గత విద్యా ప్రతిభతో పాటు ఇతర నైపుణ్యాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. 8వ తరగతి మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తూనే, ఆన్‌లైన్ క్విజ్, సైన్స్ ఫెయిర్స్, ఒలింపియాడ్స్, క్రీడలు, ఎన్‌సీసీ, మరియు స్కౌట్స్ వంటి అంశాల్లో ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటారు. గ్రామీణ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రత్యేకంగా 15 శాతం వెయిటేజీ ఇవ్వడం గమనార్హం. ఎంపికైన విద్యార్థులకు శ్రీహరికోట, హైదరాబాద్, బెంగళూరు వంటి తొమ్మిది ప్రముఖ ఇస్రో కేంద్రాల్లో మే 11 నుంచి 22 వరకు ప్రత్యక్ష శిక్షణ ఇస్తారు. ఈ కాలంలో విద్యార్థులు శాస్త్రవేత్తలతో సంభాషించడమే కాకుండా, ఉపగ్రహాల తయారీ మరియు ప్రయోగశాలలను స్వయంగా వీక్షించవచ్చు.
CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ!
విద్యార్థులకు ఈ శిక్షణ కాలంలో అయ్యే ప్రయాణ, భోజన, వసతి ఖర్చులన్నింటినీ ఇస్రో భరిస్తుంది. విద్యార్థితో పాటు వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించే అవకాశం కల్పించడం ఈ ప్రోగ్రామ్ ప్రత్యేకత. ఆసక్తి గల విద్యార్థులు మార్చి 31, 2026 లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ నెలలో ఎంపిక జాబితాలను విడుదల చేస్తారు. భవిష్యత్ శాస్త్రవేత్తలుగా ఎదగాలనుకునే విద్యార్థులకు ఇస్రో కల్పిస్తున్న ఈ అవకాశం ఒక గొప్ప మలుపుగా మారుతుందనడంలో సందేహం లేదు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :