టెక్ దిగ్గజం గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్‌తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. విశాఖపట్నంలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం జరిగింది. ఢిల్లీలోని మాన్‌సింగ్ హోటల్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు.1 గిగా వాట్ సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ డేటా సెంటర్ ఆసియాలోనే గూగుల్ సంస్థకు అతి పెద్ద డేటా సెంటర్‌గా నిలవనుంది. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ (Sundar Pichai) ఫోన్‌లో మాట్లాడారు. తమ కంపెనీ తొలి ఏఐ హబ్ విశేషాలను ప్రధానికి వివరించారు. ఈ విషయాన్ని సుందర్ పిచాయ్ (Sundar Pichai) ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ ఏఐ హబ్ ఓ కీలక మైలురాయిగా నిలువనుందని సంతోషం వ్యక్తం చేశారు.

కాగా, ఈ ఒప్పందం ప్రకారం విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం గూగుల్ కంపెనీ రూ.88,628 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో వైజాగ్ ఏఐ సిటీగా మారనుంది. 1 గిగా వాట్ సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ డేటా సెంటర్ ఆసియాలోనే గూగుల్ సంస్థకు అతి పెద్ద డేటా సెంటర్‌గా నిలవనుంది. గూగుల్ క్లౌడ్, ఏఐ వర్క్స్, సెర్చ్, యూట్యూబ్ వంటి వాటి కోసం ఈ డేటా సెంటర్‌ను వినియోగించనున్నారు. ఈ డేటా సెంటర్ అందుబాటులోకి వస్తే పరిశ్రమలు, అంకుర పరిశ్రమలు, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
సుందర్ పిచాయ్ తమిళనాడా తెలుగువాడా?
పిచాయ్ జూన్ 10, 1972న తమిళనాడులోని మధురైలో ఒక తమిళ హిందూ కుటుంబంలో జన్మించారు. అతని తల్లి లక్ష్మి స్టెనోగ్రాఫర్, మరియు తండ్రి రేగునాథ పిచాయ్ బ్రిటిష్ సంస్థ అయిన GECలో ఎలక్ట్రికల్ ఇంజనీర్.
సుందర్ పిచాయ్ జేఈఈ ర్యాంక్?
ఐఐటీలో సుందర్ పిచాయ్ జీవితం
మీడియా నివేదికల ప్రకారం, 12వ తరగతి ఉత్తీర్ణత సాధించిన తర్వాత, సుందర్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో బి. టెక్ ఎంచుకోవాలని అనుకున్నాడు కానీ దానిని పొందలేకపోయాడు. అతను కోరుకున్న బ్రాంచ్ పొందలేకపోవడానికి కారణం జెఇఇ ఐఐటిలో అతని ర్యాంకింగ్. అతని జెఇఇ ఐఐటి ర్యాంకింగ్ 1100 మరియు 1200 మధ్య ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: