हिन्दी | Epaper

Summer Vacation Plans: యుద్ధ సెగ.. విదేశీ పర్యటనలు రద్దు చేసుకుంటున్న టూరిస్టులు

Aanusha
Summer Vacation Plans: యుద్ధ సెగ.. విదేశీ పర్యటనలు రద్దు  చేసుకుంటున్న టూరిస్టులు

Summer Vacation Plans: వేసవి సెలవుల్లో విదేశీ విహారయాత్రలకు వెళ్లాలనుకున్న పర్యాటకులకు పశ్చిమాసియా ఉద్రిక్తతలు అశనిపాతంలా మారాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ పర్యాటక రంగాన్ని కుదిపేస్తోంది. ప్రాణభయంతో విదేశాల్లో గడపడం కంటే సొంత దేశంలోనే ఉండటం మేలని భావిస్తున్న పర్యాటకులు తమ విదేశీ ప్లాన్లను భారీగా రద్దు చేసుకుంటున్నారు.

Read Also: Constable bribe case : లంచం కేసులో కానిస్టేబుల్‌కు శిక్ష తగ్గించిన సుప్రీంకోర్టు

కుప్పకూలుతున్న బుకింగ్స్

టూర్ ఆపరేటర్ల లెక్కల ప్రకారం.. ముందస్తుగా విదేశీ ప్యాకేజీలు బుక్ చేసుకున్న వారిలో సుమారు 60 శాతం మంది వాటిని రద్దు చేసుకున్నారు. మరో 20 శాతం మంది వెళ్లాలో వద్దో తేల్చుకోలేకపోతున్నారు. కేవలం 10 శాతం మంది మాత్రమే ధైర్యం చేసి విమానాలు తిరుగుతున్నాయి కదా అని ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా దుబాయ్, దోహా, అబుదాబి వంటి నగరాల మీదుగా వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్స్ విషయంలో పర్యాటకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Summer Vacation Plans: War on tourists: Foreign trips canceled
Summer Vacation Plans: War on tourists: Foreign trips canceled

యుద్ధం కారణంగా విమాన మార్గాలను మళ్లించడం, ఇంధన ధరలు పెరగడంతో టికెట్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటే సమయం, ఖర్చు రెండూ భారమవుతుండటంతో టూర్ ఆపరేటర్లు కూడా వాటిని సిఫార్సు చేయలేకపోతున్నారు. “ఒకవేళ యుద్ధం ఆగిపోయినా, పర్యాటకుల్లో మళ్లీ నమ్మకం కలగడానికి చాలా సమయం పడుతుంది” అని ట్రావెల్ రంగ నిపుణుడు ఒకరు పేర్కొన్నాడు.

విదేశీ యాత్రలు రద్దు చేసుకున్న వారంతా ఇప్పుడు దేశంలోని పర్యాటక ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారు. అయోధ్య, హంపి, వారణాసి, కేరళ, గోవా వంటి ప్రాంతాలకు బుకింగ్‌లు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండటంతో లడఖ్, సిమ్లా, రిషికేష్ వంటి చల్లని ప్రదేశాలకు వెళ్లేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. 

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870