हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

S-400 Defence System : భారత్ ఆర్మీలో సుదర్శన చక్రం S-400

Sudheer
S-400 Defence System : భారత్ ఆర్మీలో సుదర్శన చక్రం S-400

భారతదేశాన్ని టార్గెట్ చేస్తూ పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాద దాడులను తిప్పికొట్టేందుకు భారత వాయుసేనకు ఎంతో మద్దతుగా నిలుస్తోంది S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ నిర్వహించిన ఆపరేషన్‌కు ప్రతీకారంగా పాకిస్తాన్ కొన్ని క్షిపణి దాడులకు యత్నించగా, భారత వాయుసేన వెంటనే అప్రమత్తమైంది. ఈ క్రమంలో గగనతలంలోకి ప్రయోగించిన శత్రు క్షిపణులను అడ్డుకోవడంలో S-400 వ్యవస్థ కీలక పాత్ర పోషించింది. ఇది భారత్‌కు గగనతలంలో తిరుగులేని ఆధిపత్యాన్ని తీసుకురాగలిగింది.

S-400 వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?

S-400 ఒక అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌గా మూడు ప్రధాన భాగాలతో పనిచేస్తుంది—శక్తివంతమైన రాడార్, క్షిపణి లాంచర్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్. దీని రాడార్ సిస్టమ్ 600 కిలోమీటర్ల పరిధిలోని శత్రు లక్ష్యాలను గుర్తించి ట్రాక్ చేయగలదు. వివిధ పరిధులలో పనిచేసే నాలుగు రకాల క్షిపణుల ద్వారా ఇది 40 నుంచి 400 కిలోమీటర్ల దూరంలోని విమానాలు, క్రూయిజ్ మిస్సైళ్లు, బాలిస్టిక్ మిస్సైళ్లు, స్టెల్త్ ఫైటర్లపై సమర్థవంతంగా స్పందించగలదు. దీనివల్ల శత్రు దాడుల విషయంలో ముందస్తుగా సమాచారం తెలుసుకుని వెంటనే యాక్షన్ తీసుకునే అవకాశం లభిస్తుంది.

భారత్-రష్యా మధ్య వ్యూహాత్మక ఒప్పందం

2018లో భారత్‌ రష్యాతో $5 బిలియన్ల ఒప్పందం కుదుర్చుకుని ఐదు S-400 యూనిట్లను కొనుగోలు చేసింది. మొదటి యూనిట్ 2021లో భారత్‌కు చేరగా, ప్రస్తుతం ఇవి ప్రధానంగా ఉత్తర సరిహద్దుల్లో, ప్రత్యేకించి పాక్ ఆక్రమిత కశ్మీర్ పరిసరాల్లో మోహరించబడ్డాయి. ప్రపంచంలోని చాలా దేశాలు, NATO సభ్యులు,S-400 వ్యవస్థను అత్యంత ప్రాణాంతకమైన రక్షణ వ్యవస్థగా పరిగణిస్తుంటే, భారతదేశానికి ఇది ఒక సుదర్శన చక్రంలా మారింది. శత్రు దేశాల ఎలాంటి వైమానిక దాడులను ఎదుర్కొనేందుకు ఇది ఎంతో కీలకంగా మారింది.

Read Also : Drone Strikes : పాక్‌ ఎయిర్‌ డిఫెన్స్‌పై గురి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870