हिन्दी | Epaper

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

Rajitha
Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లలో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. బుధవారం ట్రేడింగ్‌లో సూచీలు రోజంతా లాభనష్టాల మధ్య మారుతూ చివరికి దాదాపు ఫ్లాట్‌గా ముగిశాయి. కీలకమైన సీపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించారు. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ (sensex) 40 పాయింట్లు తగ్గి 84,233 వద్ద నిలిచింది. నిఫ్టీ మాత్రం 18 పాయింట్లు పెరిగి 25,953 వద్ద ముగిసింది.

Read also: Jio Recharge Plans: జియో రూ. 349 ప్లాన్‌తో 18 నెలల ఉచిత AI సబ్‌స్క్రిప్షన్!

Stock markets ended flat

Stock markets ended flat

ఐటీ షేర్లపై ఒత్తిడి..

రంగాల వారీగా చూస్తే ఐటీ, ప్రైవేట్ బ్యాంక్ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిఫ్టీ ఐటీ సూచీ 1.76 శాతం పడిపోగా టాప్ లూజర్‌గా నిలిచింది. అయితే ఆటో సూచీ 1.30 శాతం, ఫార్మా 1.01 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 1.03 శాతం లాభపడ్డాయి. బ్రాడర్ మార్కెట్లు కూడా స్థిరంగా కదిలాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 సూచీ 0.03 శాతం, స్మాల్‌క్యాప్ 100 సూచీ 0.02 శాతం పెరిగాయి.

రూపాయి బలహీనత.. పరిమిత శ్రేణిలో మార్కెట్

బీఎస్‌ఈలో 1,701 షేర్లు లాభాల్లో ముగియగా, 2,259 షేర్లు నష్టాల్లో నిలిచాయి. దీంతో మార్కెట్ బ్రెడ్త్ నెగిటివ్‌గా నమోదైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి 0.13 పైసలు బలహీనపడి 90.68 వద్ద ట్రేడైంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, ముడి చమురు ధరల పెరుగుదల రూపాయిపై ప్రభావం చూపుతున్నాయి. స్పష్టమైన దిశానిర్దేశం వచ్చే వరకు మార్కెట్లు పరిమిత శ్రేణిలోనే కదలే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870