ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నలుగురు వ్యోమగాములను(Astronauts) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ (spacex falcon 9 rocket) భూమికి సురక్షితంగా తిరిగి వచ్చింది. ప్రయోగం చేపట్టిన ఎనిమిది నిమిషాల్లోనే ఈ రాకెట్ (Rocket)భూమికి చేరింది. వ్యోమగాములతో కూడిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్ ఐఎస్‌ఎస్‌కు వెళ్లే మార్గంలో నిర్ణీత సమయానికి ఫాల్కన్ 9 రాకెట్ నుంచి విడిపోయింది. అనంతరం ఫాల్కన్ రాకెట్ (falcon rocket)తిరిగి సురక్షితంగా భూమికి చేరింది. ఈ క్యాప్సూల్ దాదాపు 28 గంటల పాటు ప్రయాణించి రేపు సాయంత్రం 4 గంటల ప్రాంతంలో భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఐఎస్ఎస్ కు చేరుకుంటుంది. సాయంత్రం 4:30 గంటలకు ఐఎస్ఎస్ తో అనుసంధానమవుతుందని స్పేస్ ఎక్స్ శాస్త్రవేత్తలు తెలిపారు. స్పేస్‌ఎక్స్ కంపెనీ తయారుచేసిన ఈ ఫాల్కన్ 9 రాకెట్ ప్రపంచంలోనే తొలి ఆర్బిటల్-క్లాస్ పునర్వినియోగ రాకెట్.

శుక్లా పైలట్
భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా (Shubhanshu Shukla) రోదసి యాత్ర ఎట్టకేలకు ప్రారంభమైంది. ‘యాక్సియం-4’ (Axiom -4) మిషన్‌లో భాగంగా శుభాన్షుతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయల్దేరి వెళ్లారు. వీరు ప్రయాణిస్తున్న ఫాల్కన్-9 రాకెట్ ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:01 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. ఈ వ్యోమనౌక గురువారం సాయంత్రం 4:30 గంటలకు ఐఎస్‌ఎస్‌తో అనుసంధానం కానుంది. 14 రోజులపాటూ వ్యోమగాములు అంతరిక్షంలో ఉండనున్నారు. నాసా సహకారంతో శుక్లా ఐఎస్‌ఎస్‌లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు. ఈ మిషన్‌కు శుక్లా పైలట్‌గా వ్యవహరిస్తున్నారు.
ముందడుగు
ఈ కీలక ప్రయోగానికి కొద్ది క్షణాల ముందు, శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో “భారత్ మళ్లీ అంతరిక్షంలోకి, జై హింద్” అని పోస్ట్ చేశారు. అంతకుముందు “డ్రాగన్ వ్యోమనౌక తలుపులు మూసుకున్నాయి. అన్ని కమ్యూనికేషన్, సూట్ తనిఖీలు పూర్తయ్యాయి. సీట్లు సరిచేయబడ్డాయి. యాక్సియమ్-4 సిబ్బంది ప్రయోగానికి సిద్ధంగా ఉన్నారు!” అని కూడా ఆయన తెలిపారు.
యాక్సియమ్ స్పేస్ సంస్థ, నాసా, స్పేస్‌ఎక్స్‌ల సహకారంతో ఈ యాత్రను నిర్వహిస్తోంది. ఈ యాత్రలో విభిన్న దేశాలకు చెందిన అంతర్జాతీయ సిబ్బంది పాలుపంచుకుంటున్నారు. వాణిజ్య, ప్రపంచ అంతరిక్ష పరిశోధనలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు. ఈ యాత్రలో శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) పైలట్‌గావ్యవహరించనుండగా, అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్ కమాండర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. 1984లో రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్తున్న రెండో భారతీయుడిగా శుక్లా (Shubhanshu Shukla) నిలవనున్నారు. పోలాండ్‌కు చెందిన స్లావోస్జ్ ఉజ్నాన్స్కి-విస్నియెస్కి, హంగేరీకి చెందిన టిబోర్ కాపు మిషన్ స్పెషలిస్టులుగా ఈ బృందంలో ఉన్నారు.
Read Also:Axiom-4: ఆక్సియం-4 మిషన్‌లో నింగిలోకి దూసుకెళ్లిన శుభాంశు శుక్లా