దేశవ్యాప్తంగా ఇటీవల రైళ్లపై రాళ్లదాడుల ఘటనలు పెరిగిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభమైన తర్వాత అలాంటి ఘటనలు మరింత పెరిగాయి. ప్రయాణికుల రక్షణకు తాము ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, కానీ కొందరు ఆకతాయిలు రైళ్లపై రాళ్లు వేసి, ప్రమాద పరిస్థితులు సృష్టించడంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది.ఏపీలో ఇటీవల వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) పై ముగ్గురు యువకులు రాళ్లతో దాడి చేశారు,దీంతో రైల్వే అధికారులు మరోసారి హెచ్చరించారు. ఎవరైనా రైళ్లపై రాళ్ల దాడి చేసి రైల్వే ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ (Arun Kumar Jain) హెచ్చరించారు.
ఆస్తులకు నష్టం
ఎవరైనా రాళ్ల దాడికి పాల్పడినా, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించే కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే 139లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు.రైల్వే చట్టంలోని సెక్షన్ 153 ప్రకారం రైల్వే ఆస్తులకు నష్టం కలిగిస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని SCR జనరల్ మేనేజరు అరుణ్‌కుమార్ జైన్ హెచ్చరించారు. 2025 జనవరి నుంచి మే నెల వరకు 100 మందికిపైగా రైళ్లపై రాళ్ల దాడికి పాల్పడ్డారని, వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరచామన్నారు. ఈ మొత్తం కేసుల్లో 12 మందిని కోర్టు దోషులుగా నిర్ధారించి ఒక నిందితుడికి 15 రోజుల జైలు శిక్ష విధించినట్లు తెలిపారు. మిగిలిన 11మందికి మాత్రం రూ.30,500 జరిమానా విధించినట్లు చెప్పారు.

రైల్వేశాఖ
అలాగే ఎవరైనా రైల్వే పట్టాలపై ప్రమాదకర వస్తువులు ఉంచినా నేరమే అన్నారు.అలా చేసిన 29 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు.మరోవైపు రైల్వేశాఖ కొత్తగా 200 రైళ్లను పట్టాలెక్కించేందుకు సిద్ధమైంది.ఈ మేరకు రైల్వేశాఖమంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) ఎక్స్‌లో ట్వీట్ చేశారు. వీటిలో 100 మెము రైళ్లు, 50 నమో భారత్, 50 అమృత్ భారత్ రైళ్లు ఉన్నాయన్నారు. ఈ రైళ్లు అత్యాధునిక వసతులతో సిద్ధమయ్యాయి,వీటిని ఏ రూట్లలో కేటాయించారనేది క్లారిటీ లేదు. మెము రైళ్లకు గతంలో 8 నుంచి 12 కోచ్‌లు ఉంటే ఆ సంఖ్యను 16 నుంచి 20కు పెంచినట్లు తెలిపారు. అలాగే కొత్తగా 50 నమో భారత్ రైళ్లు తయారు చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Also: Andhra Pradesh: రెండు ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి