ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో 19 పాయింట్లను ఖాతాలో వేసుకున్న పంజాబ్ కింగ్స్ అగ్రస్థానంలో నిలిచి క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది.ఈ మ్యాచ్ లోనేపంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే మూడు జట్లను ప్లే ఆఫ్స్‌కు చేర్చడమే కాకుండా క్వాలిఫయర్-1కు తీసుకెళ్లిన తొలి కెప్టెన్‌గా నిలిచాడు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహించిన అతను ఆ జట్టును టాప్ ప్లేస్‌లో నిలిపి క్వాలిఫయర్-1కు తీసుకెళ్లాడు. గతేడాది కేకేఆర్ కెప్టెన్‌గా ఆ జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లడమే కాకుండా టైటిల్ కూడా అందించాడు. తాజాగా పంజాబ్ కింగ్స్‌ను క్వాలిఫయర్-1కు తీసుకెళ్లాడు. ఈ సీజన్‌లో పంజాబ్‌ను ఫైనల్‌కు తీసుకెళ్తే మూడు జట్లను ఫైనల్ చేర్చిన కెప్టెన్‌గా కూడా నయా చరిత్రను లిఖించనున్నాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో మరే కెప్టెన్ కూడా ఈ ఫీట్ సాధించలేదు. శ్రేయస్ అయ్యర్ సూపర్ కెప్టెన్సీతో 11 ఏళ్ల తర్వాత పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరడమే కాకుండా క్వాలిఫయర్-1కు అర్హత సాధించింది.
బౌలర్లలో
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు చేసింది. మరోసారి సూర్యకుమార్ యాదవ్(39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో ఆదుకోగా హార్దిక్ పాండ్యా(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26), నమన్ ధిర్(12 బంతుల్లో 2 సిక్స్‌లతో 20) దూకుడుగా ఆడారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సెన్, విజయ్‌కుమార్ వైశాఖ్ రెండేసి వికెట్లు తీయగా హర్‌ప్రీత్ బ్రార్ ఓ వికెట్ పడగొట్టాడు.

పరుగులు
అనంతరం పంజాబ్ కింగ్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 187 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ప్రియాన్ష్ ఆర్య(35 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62), జోష్ ఇంగ్లీస్(42 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 73) హాఫ్ సెంచరీలతో రాణించారు. మిచెల్ సాంట్నర్(2/41) రెండు వికెట్లు తీయగా జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) ఓ వికెట్ పడగొట్టాడు.
Read Also : Country Cricket League: కేవలం 5.4 ఓవర్లలోనే కుప్పకూలిన రిచ్‌మండ్ సీసీ