हिन्दी | Epaper

UttarPradesh: మర్చంట్ నేవీ హత్య కేసు లో వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు

Anusha
UttarPradesh: మర్చంట్ నేవీ హత్య కేసు లో వెలుగులోకి విస్తుగొలిపే విషయాలు

మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ (29) హత్య కేసులో పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తన భర్తను ప్రియుడితో కలిసి భార్య ముస్కాన్ రస్తోగి దారుణంగా హత్య చేసిన తీరు విస్తుగొల్పుతోంది.

దారుణంగా హత్య

భర్త సౌరభ్ రాజ్పుత్(29)ను ప్రియుడు సాహిల్తో కలిసి ముస్కాన్ రస్తోగి అతి దారుణంగా హత్య చేసింది. అయితే హత్య తర్వాత సాహిల్ మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి ముక్కలుగా చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. మొదట వాళ్ళు వేసుకున్న ప్లాన్ ప్రకారం,ముక్కలుగా చేసిన శరీరాన్ని కవర్లలో పెట్టి, నిర్మానుష్య ప్రాంతంలో విసిరేయాలనుకున్నారు. ఆ క్రమంలో మొండాన్ని బెడ్బాక్స్ లో పెట్టి, రాత్రి ఆ బెడ్పైనే ముస్కాన్ నిద్రించిందని ఆ కథనాలు పేర్కొన్నాయి. మరోవైపు తల, చేతులను సాహిల్ తన ఇంటికి తీసుకెళ్లాడు. కొన్ని గంటల పాటు వాటిని తనతోనే ఉంచుకున్నాడు. తర్వాత రోజు మరో ప్లాన్ వేసుకున్నారు. లోకల్ మార్కెట్లో ఒక బ్లూడ్రమ్, సిమెంట్ కొనుక్కొచ్చారు. తర్వాత అందులో సౌరభ్ దేహాన్ని ఉంచారు. కాంక్రీట్, చెత్తాచెదారం అంతా అందులో వేసి సీల్ చేశారు.

పుట్టినరోజు కోసం

సౌరభ్ తన కుమార్తె పుట్టినరోజు కోసం విదేశాల నుంచి ఇంటికి తిరిగొచ్చాడు.సౌరభ్ వేరే ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. అక్కడ తన తల్లి చేసిన వంటకాన్ని వెంట తెచ్చుకున్నాడు. దానిని వేడి చేసిన ముస్కాన్ అప్పుడే మత్తుపదార్థాలు కలిపింది. సౌరభ్ స్పృహ కోల్పోయాక, విచక్షణారహితంగా అతడిపై దాడి చేసి చంపేశారు. హత్యను ముందుగానే ప్లాన్ చేసిన నిందితులు,కత్తి, మత్తుపదార్థాలు కొనుక్కొని వచ్చారు.

20250319105359 Meerutmurder

వాట్సప్ గ్రూప్ ద్వారా పరిచయం

2019లో వాట్సప్ గ్రూప్ ద్వారా వారి పరిచయం మళ్లీ మొదలై, వివాహేతర సంబంధానికి దారితీసింది.మృతదేహాన్ని విసిరేయడానికి నిర్మానుష్య ప్రాంతాలను వెతుక్కున్నారని పోలీసులు తెలిపారు. ఈ నిందితులు ఇద్దరూ స్కూల్ నుంచి స్నేహితులు.

వివాహేతర సంబంధం

ముస్కాన్ కు చిన్నప్పటినుంచి సినిమా స్టార్ కావాలని కోరికట. ఈ విషయాన్ని మృతుడి సోదరుడు మీడియాకు వెల్లడించారు. దాంతో ఆమె ఒకసారి ఇంటినుంచి కూడా పారిపోయిందని చెప్పారు.ఈ హత్య గురించి తెలియగానే ఆమెను ఉరితీయాలని ముస్కాన్ తల్లి మీడియాతో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె నిందితురాలి సవతి తల్లి అని తెలుస్తోంది. సౌరభ్ రాజ్పుత్(29), ముస్కాన్ (27) 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సౌరభ్ మర్చంట్ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత ముస్కాను సాహిల్(25)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీనిపై వారు విడాకుల వరకు వెళ్లారు. కానీ కుమార్తె కోసం సౌరభ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన అతడు గతనెల కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగొచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్ప్రి యుడితో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టింది. 2023 నుంచే భర్తను చంపడానికి ఆమె యత్నించిందని పోలీసు వర్గాలు తెలిపాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

వృద్ధాప్యంలో కన్నతండ్రిని వేధిస్తున్న కొడుకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ఆటో – స్కూటీ ఢీ.. ఇద్ద‌రు యువ‌కులు స్పాట్ డెడ్

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఎయిడ్స్ ఇంజక్షన్ ఘటనలో యువతికి నెగిటివ్

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

ఆర్టీసీ బస్సు – లారీ ఢీ.. ప్రయాణికులకు తీవ్ర గాయాలు!

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!
0:26

సామాన్యుడి ప్రాణం తీసిన గ్యాస్ కొరత!

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

పిల్లలను చంపి ఆపై తల్లి ఆత్మహత్య

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

సోదరిని పొడిచి చంపిన అన్న.. ఆ తర్వాత ఏం చేశాడో తెలుసా?

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

చేపల కోసం స్నేహితుడిని చంపేశారు.. తీరా చూస్తే!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్‌.. జాగ్ర‌త్త!!

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

గుండె నిండా దుఃఖం అయినా పరీక్ష రాసిన వైనం

పెళ్ళికి నిరాకరించిందని.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్

పెళ్ళికి నిరాకరించిందని.. యువతికి ఎయిడ్స్ ఇంజక్షన్

📢 For Advertisement Booking: 98481 12870