हिन्दी | Epaper

మ‌స్క్‌తో మోదీ భేటీలో పాల్గొన్న శివ‌న్ జిలిస్

Vanipushpa
మ‌స్క్‌తో మోదీ భేటీలో పాల్గొన్న శివ‌న్ జిలిస్

టెక్ బిలియ‌నీర్ ఎల‌న్ మ‌స్క్‌ను ప్ర‌ధాని మోదీ క‌లిశారు. అమెరికా టూర్ వెళ్లిన మోదీ.. అక్క‌డ మ‌స్క్‌తో భేటీ అయ్యారు. అయితే బ్లెయిర్ హౌజ్‌లో జ‌రిగిన‌ భేటీలో ముగ్గురు పిల్ల‌లతో పాటు శివ‌న్ జిలిస్ అనే మ‌హిళ కూడా పాల్గొన్న‌ది. మ‌స్క్ పార్ట్న‌ర్ శివ‌న్ జిలిస్ గురించి కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిసాయి. మ‌స్క్‌కు చెందిన బ్రెయిన్ చిప్ స్టార్ట‌ప్ కంపెనీ న్యూరాలింక్‌లో ఉన్న‌త‌శ్రేణి ఉద్యోగం చేస్తోంది శివ‌న్ జిలిస్‌. కానీ చాన్నాళ్ల నుంచి ఆమె గురించి ఎవ‌రికీ తెలియ‌దు. గ‌డిచిన ఆర్నెళ్ల‌లో ఆమె మ‌స్క్‌తో క‌లిసి క‌నిపించ‌డం ఇది రెండోసారి.
త‌ల్లి భార‌తీయ సంత‌తి
శివ‌న్ జిలిస్ వ‌య‌సు 39 ఏళ్లు. కెన‌డాలో పుట్టిందామె. యేల్ యూనివ‌ర్సిటీలో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసింది. ఆమె త‌ల్లి భార‌తీయ సంత‌తి వ్య‌క్తి. ఆమె పేరు ఎన్ శార‌ద‌. శివ‌న్ జిలిస్ తండ్రి పేరు రిచ‌ర్డ్ జిలిస్‌. అత‌ను కెన‌డా దేశ‌స్థుడు. న్యూరాలింక్ కంపెనీలో ఆపరేష‌న్స్‌, స్పెష‌ల్ ప్రాజెక్ట్స్ డైరెక్ట‌ర్‌గా జిలిస్ ప‌నిచేసింది. 2017 నుంచి 2019 వ‌ర‌కు టెస్లా కంపెనీ ప్రాజెక్టు డైరెక్ట‌ర్‌గా చేసిందామె. సామ్ ఆల్ట్‌మాన్‌కు చెందిన ఓపెన్ఏఐ కంపెనీకి అడ్వైజ‌ర్‌గా కూడా చేసింది. బ్లూమ్‌బ‌ర్గ్ బీటా కంపెనీ ఇన్వెస్ట్‌మెంట్ బృందంలో ఫౌండింగ్ మెంబ‌ర్‌గా ఉన్న‌ది.

మ‌స్క్‌తో మోదీ భేటీలో పాల్గొన్న శివ‌న్ జిలిస్

ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు
శివ‌న్ జిలిస్‌.. 2015లో.. ఫోర్బ్స్ అండ‌ర్ 30 లిస్టులో చోటు సంపాదించింది. లింక్డిన్ అండ‌ర్‌35లో కూడా ఆమె పేరు ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఎల‌న్ మ‌స్క్ పార్ట్న‌ర్‌గా శివ‌న్ జిలిస్‌ను గుర్తిస్తారు. ఆ జంట‌కు ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు. 2021లో ఇద్ద‌రు జ‌న్మించారు. 2024లో మూడ‌వ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆ జంట త‌మ రిలేష‌న్ గురించి అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. త‌న 11 మంది పిల్ల‌ల కోసం నిర్మించిన టెక్సాస్ కాంపౌండ్‌లోకి శివ‌న్ జిలిస్ వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

10 ఇరాన్ మైన్ లేయింగ్ బోట్లను లేపేసాం – ట్రంప్

10 ఇరాన్ మైన్ లేయింగ్ బోట్లను లేపేసాం – ట్రంప్

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా, సంస్థలో కీలక మార్పు

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

‘ఖర్గ్‌ ఐలాండ్‌’పై ట్రంప్‌ కన్ను

‘ఖర్గ్‌ ఐలాండ్‌’పై ట్రంప్‌ కన్ను

ఇంధన పొదుపు దిశగా థాయిలాండ్, వియత్నాం అడుగులు

ఇంధన పొదుపు దిశగా థాయిలాండ్, వియత్నాం అడుగులు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

జపాన్ లో ఆరు నెలలకు సరిపడా చమురు స్టాక్

జపాన్ లో ఆరు నెలలకు సరిపడా చమురు స్టాక్

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

యుద్దం ఆపడం మా చేతుల్లో పని..ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

యుద్దం ఆపడం మా చేతుల్లో పని..ట్రంప్ వ్యాఖ్యలకు ఇరాన్ కౌంటర్

ఇరాన్‌లో విషాదం: చమురు డిపోలపై దాడుల తర్వాత కురుస్తున్న ‘నల్లటి ఆమ్ల వర్షం’

ఇరాన్‌లో విషాదం: చమురు డిపోలపై దాడుల తర్వాత కురుస్తున్న ‘నల్లటి ఆమ్ల వర్షం’

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

అమెరికాకు ఇప్పుడు ఉక్రెయిన్ సాయం అవసరం!

📢 For Advertisement Booking: 98481 12870