हिन्दी | Epaper

Congress: పాకిస్థాన్‌ను పొగిడిన శశిథరూర్..అసలేం జరిగిందంటే?

Vanipushpa
Congress: పాకిస్థాన్‌ను పొగిడిన శశిథరూర్..అసలేం జరిగిందంటే?

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్‌.. భారతదేశ శత్రువైన పాకిస్థాన్‌ను పొగుడుతున్న ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. టి20 వరల్డ్ కప్‌లో భారత్‌తో ఆడే విషయంలో పాకిస్థాన్ తీసుకున్న దౌత్యపరమైన నిర్ణయాన్ని థరూర్ కొనియాడుతూ కనిపించారు. అయితే తాజాగా ఈ వీడియోపై ఆయన స్పందించారు. ఆ గొంతు, భాష నాది కాదని.. కావాలనే ఎవరో కృత్రిమ మేధ సాయంతో ఈ వీడియోను సృష్టించారని చెప్పారు. తనకు ఈ వీడియోతో ఎలాంటి సంబంధమూ లేదని.. దాన్ని తీక్షణంగా గమనిస్తే ఆ విషయం అందరికీ అర్థం అవుతుందన్నారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో శశి థరూర్(Shashi Tharoor) గొంతును పోలిన వాయిస్‌తో కొన్ని సంచలన వ్యాఖ్యలు ఉన్నాయి.

Read Also: Jaipur: డ్రైవర్‌ నిర్లక్ష్యం ప్రాణం తీసింది.. అసలేం జరిగింది?

Shashi Tharoor
Shashi Tharoor

మన దేశంలోనూ ఈ వీడియో వైరల్

“పాకిస్థాన్ దౌత్యపరంగా అద్భుతమైన విజయం సాధించింది. మైదానంలో వారు ఎలా ఆడుతారో తెలియదు కానీ.. దౌత్యపరంగా మాత్రం భారత క్రికెట్ బోర్డు (BCCI)ని అడ్డంగా బుక్ చేశారు. బలహీనమైన దేశం కూడా తెలివైన దౌత్యంతో రాక్షసుడి లాంటి ప్రత్యర్థిని ఎలా ఓడించవచ్చో పాక్ నిరూపించింది” అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. ముఖ్యంగా పాకిస్థానీ సోషల్ మీడియా అకౌంట్లు ఈ వీడియోను విపరీతంగా షేర్ చేస్తూ ప్రచారం చేసుకున్నాయి. దీంతో మన దేశంలోనూ ఈ వీడియో వైరల్ అయింది. ఈ వీడియోపై శశి థరూర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. “ఇది కృత్రిమ మేధతో సృష్టించిన నాణ్యత లేని ‘ఫేక్ న్యూస్’. అందులో ఉన్న భాష కానీ.. వాయిస్ కానీ నావి కావు” అని ఆయన స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

ఇరాన్‌కు రష్యా అండ: నూతన సుప్రీం లీడర్ ముజ్తబాకు పుతిన్ అభినందనలు!

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

తోమాహాక్ క్షిప‌ణియే ఇరాన్ బాలిక‌ల స్కూల్‌పై ప‌డింది

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఖర్గ్ దీవిపై దాడికి అమెరికా ఎందుకు వెనుకాడుతోంది?

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

క్రూడ్ ఆయిల్ సంక్షోభంతో స్కూళ్లు, కాలేజీలు బంద్

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. దద్దరిల్లిన ఇజ్రాయెల్

టెల్ అవీవ్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం.. దద్దరిల్లిన ఇజ్రాయెల్

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

అమెరికాపై ఇరాన్ హ్యాకర్ల సైబర్ దాడులు

అమెరికాపై ఇరాన్ హ్యాకర్ల సైబర్ దాడులు

సరైన సమయంలో ఇరాన్​తో యుద్ధాన్ని ముగిస్తాం-ట్రంప్

సరైన సమయంలో ఇరాన్​తో యుద్ధాన్ని ముగిస్తాం-ట్రంప్

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

గల్ఫ్ దేశాల్లో తాగునీటి ప్లాంట్లుపై దాడికి యత్నం

గల్ఫ్ దేశాల్లో తాగునీటి ప్లాంట్లుపై దాడికి యత్నం

ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్‌ దాడులు.. అమెరికా సీరియస్!

ఆయిల్ డిపోలపై ఇజ్రాయెల్‌ దాడులు.. అమెరికా సీరియస్!

📢 For Advertisement Booking: 98481 12870