రైల్వే కార్యకలాపాల భద్రతపై జిఎం సంజయ్కుమార్ శ్రీవాస్తవ సమీక్ష
హైదరాబాద్ (తార్నాక): రైలు కార్యకలాపాల భద్రతపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్(South Railway General Manager) సంజయ్ కుమార్ శ్రీవాస్తవ (sanjay kumar srivastava) భద్రతపై సోమ వారం సికింద్రాబాద్ రైల్(Secunderabad Rail) నిలయంలో సమీక్ష సమావేశం నిర్వహిం చారు. అదేవిధంగా మధ్య రైల్వేలో చేపట్టిన స్టేషన్ పునరాభివృద్ధి పనుల పురోగతిపై కూడా సమీక్షించారు. ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అద నపు జనరల్ మేనేజర్ నీరజ్ అగ్రవాల్ అన్ని ప్రధాన విభాగాధి పతులతో పాటు పాల్గొన్నారు. సికిందరాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్, గుంటూరు మరియు నాందేడ్ వంటి ఆరు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు (డిఆర్ఎంలు) విడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా జోన్లోని 119 స్టేషన్లలో సుమారు రూ.6744 కోట్లతో చేపట్టిన పునరాభివృద్ధి పనుల స్థితిగతులపై సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సమీక్ష నిర్వహించారు. వీటిలో
బేగంపేట, వరంగల్ కరీం నగర్ అనే 3. స్టేషన్లలో పనులు పూర్తయ్యాయి ఇటీవల ప్రధానమంత్రిచే ప్రారంభించ బడ్డాయి.

పని ప్రదేశాలలో సరైన భద్రతా జాగ్రత్తలు
ప్రధాన కార్యాలయం ఆరు డివిజన్ల సంబంధిత అధికారులు పునరాభివృద్ధి కోసం గుర్తించిన స్టేష న్లపై వాటి డివిజన్, ప్రాజెక్ట్ ఖర్చు, పూర్తి చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్న తేదీ, పని యొక్క ప్రస్తుత స్థితికి సంబంధించిన వివరణాత్మక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. జోన్ వ్యాప్తంగా 11 స్టేషన్లలో ప్రధానంగా చేపట్టిన పునరాభివృద్ధి పనుల పురోగతి స్థితిపై జీఎం ప్రశంసించారు. ప్రాజెక్టులను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి పనుల వేగంతో కొనసాగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అన్ని భద్రతా మార్గదర్శకాలను పాటించాలని మరియు పనుల నాణ్యతను తప్పకుండా నిర్ధారించాలని కూడా ఆయన అధికారులకు సూచించారు. ప్రయాణీకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పని ప్రదేశాలలో సరైన భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. సమావేశంలో జోన్ అంతటా లెవల్ క్రాసింగ్ గేట్ల వద్ద అనుసరిస్తున్న భద్రతా జాగ్రత్తలను సంజయ్ కుమార్ సమీక్షించారు.
క్రమం తప్పకుండా తనిఖీలు
గుర్తించబడిన ప్రమాదలకు అవకాశం గల లెవెల్ క్రాసింగ్ గేట్లపై ఆయన ప్రత్యేక దృష్టి సారించాలని క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని, సిబ్బందికి కౌన్సిల్ ఇవ్వాలని, అన్ని భద్రతా విధానాలను ఖచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. ట్రాక్ల భద్రత, పరికరాల లభ్యత మొదలైన వాటికి సంబంధించి జోన్ చేపట్టిన వివిధ భద్రతా డ్రైవ్ల స్థితిని కూడా జనరల్ మేనేజర్ సమీక్షించారు. అగ్నిమాపక భద్రతా చర్యలు, ట్రాక్ భద్రత, విద్యుత్ మరియు సిగ్నలింగ్, మెకానికల్ వస్తువులు, వర్షాకాలంలో పాటించవలసిన జాగ్రత్తలపై
జీఎం సుచనలు చేశారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు
అడ్డగుట్ట సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజీమ్ కుమార్ శ్రీ వాత్సవ రైల్వే ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకు సూచించారు. కౌంటర్లు, పార్కింగ్, సర్యూలేటింగ్ ఏరియాల్లో దేవడుతున్న అభివృద్ధి చర్యలపై అధికారులు, ఇంజనీర్లతో చర్చించారు. రైల్వే స్టేషన్ పున నిర్మాణ ప్రణాళికలు, పురోగతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిఎంకు వివరించారు. అదే విధంగా ప్లాట్ ఫార మ్’ 1 నుంచి, ఫ్లాట్ నెం 10 వరకు ఇరువైపుల జరుగు తున్న అభివృద్ధి పనులను ఆయన పర్యవేక్షించారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Congress Leader Murder: నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ నేత దారుణ హత్య