శబరిమల(Sabarimala) అయ్యప్ప ఆలయానికి చెందిన బంగారం తాపడం వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తును మరింత విస్తరించింది. ఈ ఘటనకు సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలపై దృష్టి సారించిన ఈడీ, కేరళతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మొత్తం 21 ప్రదేశాల్లో ఒకేసారి సోదాలు నిర్వహిస్తోంది.
Read Also: Rajasthan: ఉదయ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు దుర్మరణం

కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 21 చోట్ల తనిఖీలు
ఈ తనిఖీల్లో ప్రధాన నిందితుడిగా పేర్కొనబడుతున్న ఉన్నికృష్ణన్ పొట్టి నివాసంతో పాటు, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఏ. పద్మకుమార్ ఇంట్లో కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. బంగారం తాపడం ద్వారా వచ్చిన అక్రమ లాభాలు ఇతర మార్గాల ద్వారా మార్పిడి అయ్యాయా?, ఆ మొత్తాలు ఎక్కడికి తరలించబడ్డాయన్న అంశాలపై అధికారులు లోతైన పరిశీలన చేస్తున్నారు.
కేరళ పోలీసు శాఖ ఈ కేసులో నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను(Sabarimala) ఆధారంగా తీసుకుని, ఈడీ జనవరి 9న మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ప్రత్యేకంగా కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ కొనసాగిస్తుండగా, ఇప్పుడు ఈడీ రంగప్రవేశంతో కేసు మరింత కీలక దశకు చేరినట్లు భావిస్తున్నారు.
సోదాల సమయంలో కీలక పత్రాలు, డిజిటల్ రికార్డులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలను ఈడీ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో మరికొందరు వ్యక్తులు, సంస్థల పాత్రపై కూడా విచారణ జరగనున్నట్లు అధికారులు సూచిస్తున్నారు. శబరిమల ఆలయానికి సంబంధించిన ఈ సున్నిత అంశంపై దర్యాప్తు ఎటు దారి తీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: