ఇటీవల కాలంలో సెలబ్రిటీల విడాకులు విపరీతంగా పెరుగుతున్నాయి. సినీ రంగంలో విడాకులు ఓ సాధారణ విషయంగా మారిపోగా, ఇప్పుడు అదే ట్రెండ్ క్రికెట్ ప్రపంచాన్ని కూడా గట్టిగా ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే అనేక మంది టీమిండియా క్రికెటర్లు తమ భార్యలకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే దారిలో పయనించబోతున్న క్రికెటర్ల పేర్లు వార్తల్లోకి వచ్చాయి.
చాహల్ – ధనశ్రీ వర్మ విడాకులు
టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మరియు ప్రముఖ డ్యాన్సర్ ధనశ్రీ వర్మ ఇటీవల విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు నెలకొన్నాయని, ఫైనల్‌గా విడిపోవాలని నిర్ణయించుకున్నారని సమాచారం. గత కొన్ని నెలలుగా వీరిద్దరూ సోషల్ మీడియాలో విభిన్న సిగ్నల్స్ ఇస్తూ వచ్చారు.
వీరేంద్ర సెహ్వాగ్
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా తన వైవాహిక జీవితానికి గుడ్‌బై చెప్పబోతున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. కొంతకాలంగా సెహ్వాగ్ తన భార్యతో విబేధాలు ఎదుర్కొంటున్నారని, దాదాపు ఏడాది నుంచి వీరిద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని సమాచారం.విడాకుల వార్తలకు మరింత బలం చేకూర్చిన విషయం ఏమిటంటే సెహ్వాగ్, తన భార్య సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడమే. ఇదే కాకుండా, వీరిద్దరూ గత కొన్ని నెలలుగా కలిసివున్న ఫొటోలు కూడా షేర్ చేయలేదు. దీంతో సెహ్వాగ్ విడాకులు దాదాపు ఖాయమనే ప్రచారం ఊపందుకుంది.

మనీష్ పాండే ఆశ్రిత శెట్టి విడాకులు
తాజాగా టీమిండియా బ్యాట్స్‌మెన్ మనీష్ పాండే కూడా విడాకుల బాటలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. మనీష్ పాండే 2019లో కన్నడ నటి ఆశ్రిత శెట్టిను వివాహం చేసుకున్నాడు. అయితే, వీరి మధ్య గత కొంతకాలంగా అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.ఈ వార్తలకు బలమైన కారణం ఏమిటంటే ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేయడం, పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడం. వీరి మధ్య గత కొంతకాలంగా విభేదాలు పెరిగిపోయి, చివరికి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కోర్టులో విచారణ పూర్తైన తర్వాత వీరు అధికారికంగా విడాకుల ప్రకటన చేసే అవకాశం ఉంది.
విడాకుల ట్రెండ్
ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో విడాకులు సాధారణంగా మారాయి. తాజాగా, అదే ట్రెండ్ క్రికెట్ ఫీల్డ్‌లోనూ కొనసాగుతోంది.క్రికెటర్లు ఇప్పుడు సినిమా సెలబ్రిటీల్లా వ్యక్తిగత జీవితం గురించి చాలా పారదర్శకంగా ఉంటున్నారు.సోషల్ మీడియాలో అన్‌ఫాలో, పెళ్లి ఫొటోలు డిలీట్ చేయడం వంటి చర్యలు విడాకుల సంకేతాలను ముందుగానే తెలియజేస్తున్నాయి.ఒకరి తర్వాత ఒకరు విడాకులు తీసుకుంటుండటంతో, అభిమానులు ఇది క్రికెట్‌లో కొత్త ట్రెండా? అనే చర్చ మొదలైంది.