కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Home Minister Amit Shah) ఘాటుగా స్పందించారు. ఆర్ఎస్ఎస్‌ను(RSS) నిషేధించాలని ఖర్గే చేసిన వ్యాఖ్యలపై షా తీవ్రంగా ప్రతిస్పందిస్తూ, ఆ సంస్థ దేశ సేవలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. అమిత్ షా మాట్లాడుతూ, “ఆర్ఎస్ఎస్ దేశభక్తి, క్రమశిక్షణకు ప్రతీక. దేశాన్ని బలంగా, ఐక్యంగా మార్చడంలో ఆ సంస్థ ముఖ్య భూమిక వహించింది. దేశాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చేందుకు నాకు, నన్ను పోలిన ఎంతో మందికి ఆర్ఎస్ఎస్ స్ఫూర్తినిచ్చింది,” అని తెలిపారు.
Read Also: Hydra: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

అలాగే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరూ ఆర్ఎస్ఎస్(RSS) నుంచి వచ్చిన నాయకులని గుర్తుచేశారు. “దేశానికి సేవ చేసిన గొప్ప నాయకులు ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినవారే. ఖర్గే కోరుకున్నది ఎప్పటికీ జరగదు,” అని షా స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు తరచుగా ఆర్ఎస్ఎస్‌పై విమర్శలు చేయడం కొత్తేమీ కాదని, కానీ ఆ సంస్థ దేశ నిర్మాణంలో కలిగించిన ప్రభావం ఎవరూ నిర్లక్ష్యం చేయలేరని షా పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: